వెండితెరకెక్కనున్న దార్శనికుడి కథ.. చంద్రబాబు బయోపిక్‌కు రంగం సిద్ధం!

Publish Date:Apr 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన అగ్రనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన ప్రయాణాన్ని బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో రాజధాని ఫైల్స్ వంటి సెన్సేషనల్ మూవీతో అమరావతి రైతుల ఆవేదనను, రాజధాని ఆవశ్యకతను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు భాను చంద్రబాబు బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాయి. చంద్రబాబు నాయుడు జీవితంలోని కీలక ఘట్టాలను, ఆయన సాగించిన పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు భాను సిద్ధమవుతున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. 

 చంద్రబాబు నాయుడు ప్రస్థానం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని చంద్రబాబు బయోపిక్ దర్శకుడు భాను పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ప్రజాక్షేమం, ప్రతి ఆలోచన వెనుక భావితరాల భవిష్యత్తు ఉంటుందన్న ఆయన.. నిత్యకృషివలుడైన నాయకుడి జీవితంలో ఉండే ఉద్వేగాలు, సంఘర్షణలు,  విజయాలను ఈ బయోపిక్ ద్వారా ప్రపం కళ్లకు కట్టనున్నట్లు చెప్పారు.  నిఘంటువులోని ప్రతి పదానికి అర్థం ఉన్నట్లే, ఆయన వేసిన ప్రతి అడుగులో ఒక గొప్ప చరిత్ర ఉందని భాను అన్నారు. 

ఈ చిత్రాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా  పాన్ వరల్డ్' రేంజ్ లో  నిర్మించేందుకు  ప్లాన్ చేస్తున్నారు. వివిధ దేశాల్లోనూ చంద్రబాబుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేసే యోచనలో ఉన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ మూవీని తీర్చిదిద్దాలని చిత్ర బృందం కంకణం కట్టుకుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ  సాగుతోంది. భారీ తారాగణంతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు. చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.  రాజకీయ బయోపిక్‌లు టాలీవుడ్‌లో కొత్త కాకపోయినా, చంద్రబాబు వంటి సమకాలీన రాజకీయ దిగ్గజం కథను భాను వంటి   దర్శకుడు హ్యాండిల్ చేయడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.  రాజధాని ఫైల్స్ చిత్రంలో అమరాతి రైతుల బాధలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన దర్శకుడు భాను.. చంద్రబాబు బయోపిక్ ను మరింత ప్రతిభావంతంగా, ప్రభావమంతంగా చూపుతారన్న అంచనాలు ఉన్నాయి.  చంద్రబాబు బయోపిక్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By
en-us Political News

  
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.