శ్రీశైలం జలాశయానికి వరద... 3 గేట్లు ఎత్తివేత
Publish Date:Sep 13, 2025
Advertisement
ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యామ్ నుంచి 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,20,279 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,79,,104 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్‌వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 82,824 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలుగా కొనసాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srisailam-project-36-206105.html
http://www.teluguone.com/news/content/srisailam-project-36-206105.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





