టీపీసీసీ పదవికి తీవ్ర పోటీ! శ్రీధర్ బాబు కోసం కేసీఆర్ లాబీయింగ్!

Publish Date:Dec 6, 2020

Advertisement

వరుస పరాజయాలతో తెలంగాణ కాంగ్రెస్ లో నిస్తేజం అలుముకుంది. దుబ్బాక ఓటమితో ఢీలా పడిన హస్తం పార్టీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో మరింత కుదైలేంది. జీహెచ్ఎంసీ లో ఒకప్పుడు హవా చూపిన హస్తం పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు రావడంతో.. ఆ పార్టీ పని అయిపోయినట్లననే చర్చ జరుగుతోంది. అయితే వరుస ఓటములతో అయోమయంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు  హైకమాండ్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఆ పదవిలో కొత్త నేతను నియమించేందుకు రాహుల్ టీమ్ కసరత్తు చేస్తోంది. రేపో మాపో తెలంగాణకు కొత్త పీసీసీ పేరును ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి వినిపిస్తున్న నేతలపై కాంగ్రెస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు పీసీసీ పదవి ఇస్తున్నారన్న వార్తలపై ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. శ్రీధర్ బాబుకు పీసీసీ పదవి దక్కేలా సీఎం కేసీఆర్ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.  సీఎం కేసీఆర్ తో శ్రీధర్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారని చెబుతున్నారు. శ్రీధర్ బాబు భార్య శైలజా రామయ్యర్ తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేనేత, జాళీ శాఖ కమిషనర్ గా ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఆమెకు  అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం ఉంది. తమకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశ్యంతోనే శ్రీధర్ బాబు పీసీసీ చీఫ్ గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు దూకుడుగా పోరాటం చేయలేరనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలతో జోష్ మీదున్న బీజేపీని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను.. రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటారనే పేరున్న శ్రీధర్ బాబు ఎంతవరకు ఢీకొడతారన్నది అనుమానమే. 

 

పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని చెప్పుకుంటున్నారు భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే కోమటిరెడ్డిపైనా కాంగ్రెస్ నేతలకు భరోసా కలగడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి సోదరులకు  కేసీఆర్ తో సన్నిహత సంబంధాలు ఉన్నాయంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టు పనులను కోమటిరెడ్డి సంస్థలు చేస్తున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ తో సంబంధాలు ఉండటం వల్లే ఆయన సంస్థలకు కాంట్రాక్టులు వచ్చాయంటున్నారు. ప్రభుత్వ పనులు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కేసీఆర్ పై దూకుడుగా ముందుకు వెళ్లలేరనే చర్చ హస్తం నేతల నుంచే వస్తోంది. దీంతో పాటు కోమటిరెడ్డి సోదరులు బీజేపీ నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా పార్టీకి పెద్ద ప్రయోజనం ఉండదని గాంధీభవన్ లోనే గుసగుసలాడుకుంటున్నారట. 

 

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ కేడర్ నుంచి బాగా డిమాండ్లు వస్తున్నాయి. తన వాగ్దాటి, పంచ్ ప్రసంగాలతో ఆకట్టుకునే రేవంత్ రెడ్డే అయితేనే కాంగ్రెస్ బతుకుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. అయితే రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్లు పెదవి విరుస్తున్నారట. రేవంత్ రెడ్డికి ఇప్పటికి చంద్రబాబు మనిషిగానే ముద్ర ఉంది.ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు ఇంకా విచారణలో ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే..గతంలో టీడీపీలో పనిచేసిన నేతలంతా ఆయనకు మద్దతు ఇచ్చినా.. కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి ఆయనకు సహకారం లభించకపోవచ్చని భావిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన నేతలకు పీసీసీ పగ్గాలు ఇవ్వవద్దని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు ఓపెన్ గానే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా గులాబీ బాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. 

 

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో పార్టీని గాడిలో పెట్టాలంటే అన్ని వర్గాలను కలుపుకుపోయే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన వారు.. ప్రభుత్వంలో ఉన్న పార్టీతో లోపాయకారి ఒప్పందాలతో కాంట్రాక్టులు చేసుకునే వారు కాకుండా.. మొదటి నుంచి పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న నేతకు ఇస్తేనే బాగుంటుందనే కొందరు కొంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారట. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాకా కొన్ని రోజులకే జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ కు మొదటి షాక్ ఇచ్చారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. అలాంటి నేతకు పీసీసీ ఇస్తే ఫర్వాలేదంటున్నారు. సుదర్శన్ రావు వంటి సీనియర్లు పీసీసీ పదవిని చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ నేతకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే గ్రూపు రాజకీయాలు లేకుండా పార్టీ ముందుకు పోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ...

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.