లంకలో రావణకాష్టం.. ముదిరిన రాజకీయ సంక్షోభం

Publish Date:Jul 9, 2022

Advertisement

లంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. ప్రజలలో అసహనం రావణకాష్టంలా రగులుతోంది.శ్రీలంకను అర్ధికంగా దివాళా స్థితికి తీసుకువచ్చిన అధ్యక్షుడు రాజపక్సే గట్టబాయ రాజీనామా చేయాలంటూ గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు శనివారం పరాకాష్టకు చేరుకున్నాయి.శనివారం కర్ఫ్యూ ఎత్తివేయడంతో లక్షలాది మంది ఆందోళనకారులు దేశం నలుమూలల నుంచీ కొలంబో చేరుకుని అధ్యక్షుడి నివాసాన్నిముట్టడించారు. జనసందోహాన్ని అదుపు చేయడంలో భద్రతా దళాలు ఏం చేయలేక చేతులెత్తేశాయి. ఎలాంటి విధ్వంసం, రక్తపాతం లేదు. అధ్యక్ష నివాసం జనం అధీనంలోకి వెళ్లిపోయింది. అయితే జనం అధ్యక్ష నివాసాన్ని ముట్టడించడానికి ముందే రాజపక్సె గొట్టబాయ పలాయనం చిత్తగించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్న సమాచారం లేదు. దేశం విడిచి వెళ్లిపోయారని అంటున్నారు.

ఏది ఏమైనా దేశాధ్యక్షుడు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక  అజ్ణాతంలోకి వెళ్లిపోయారన్నది మాత్రం వాస్తవం.ఆందోళనకారులు శ్రీలంక ప్రధాని నివాసాన్ని దగ్ధం చేశారు. ప్రజాగ్రహానికి శ్రీలంక రాజకీయం వణికిపోయింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా సమావేశమయ్యారు. ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే తాను తక్షణమే రాజీనామా చేస్తానని ఆయన ఆ సమావేశంలో ప్రకటించారు. వారం రోజుల్లో తాత్కాలిక అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

అంతకు ముందు జన సముద్రం శ్రీలంక రోడ్లపై కవాతు చేస్తున్నదా అన్నట్లు కొలంబో రోడ్లన్నీ ఇసుక వేస్తే రాలదన్నంతగా ఆందోళన కారులతో నిండిపోయాయి. దేశంలో అన్ని దార్లూ కొలంబోకేనా అన్నట్లు రహదారుల జన ప్రవాహం కొలంబో చేరుకుని అధ్యక్షుడు రాజపక్సె గొట్టబాయ నివాసానికి దారితీసింది. బారికేడ్లను ఛేదించుకొని మరీ గొటబాయ నివాసం వైపు జన ప్రవాహం కదిలింది. ఆస్తులకు ఎలాంటి నష్టం చేయకుండానే అధ్యక్షుడి నివాసం జనం స్వాధీనమైంది.

ఆందోళనకారులు గొటబాయ నివాసంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టారు.  అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అధ్యక్ష భవనంలోని గదులు, కారిడార్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ఇంకా వందలాది మంది ఆందోళనకారులు భవనం వెలుపల ఉన్నారు.  రాజపక్సె గొటబాయ రాజీనామా చేసేదాకా తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.