పాపం శ్రీలక్ష్మి!

Publish Date:Dec 25, 2024

Advertisement

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే ఎవరికీ అయ్యో పాపం అని కూడా అనాలని అనిపించదు.  ఎందుకంటే గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రొకో కేసులలో విచారణను ఎదుర్కొన్నారు. ఆ అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అయితే అప్పటి తప్పిదాల నుంచి ఆమె ఎటువంటి పాఠాలూ నేర్చుకోలేదు. 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత.. ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అలా వచ్చిన ఆమెకు జగన్ కీలక పోస్ట్ ఇచ్చారు. 

సీనియర్ ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి జగన్ క్విడ్ ప్రోకో కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు. అప్పట్లో, కేసుల ఒత్తిడి ఆమె ఆరోగ్యం క్షీణించింది మరియు చాలా నెలలు ఆమెను వీల్ చైర్‌కు పరిమితం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ ఇప్పించారు.  ఆమె జగన్ కోసం మళ్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అది పక్కన పెడితే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ మరి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తదుపరి సీఎస్ ఎవరు అన్న చర్చకు వచ్చింది. సీనియారిటీని బట్టి చూస్తే నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో  శ్రీలక్ష్మి నియమితురాలు అవ్వాల్సి ఉంటుంది.

అయితే  జగన్ తో మఅంటకాగి నింబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఆమెకు ఆ పదవి దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవు.  దీంతో ప్రతి ఐఏఎస్ కలలు కనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి శ్రీలక్ష్మికి అందే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందుకు కారణం ఆమె స్వయం కృతాపరాధమేనని ఏపీ సెక్రటేరియెట్ లో చర్చ జరుగుతోంది.  జగన్  కోసం నిబంధనలను తుంగలోకి తొక్కినందుకు శ్రీలక్ష్మి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు.  ఆమె మూల్యం చెల్లిస్తోందని ఏపీ సెక్రటేరియట్ లాబీల్లో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా శ్రీలక్ష్మికి సీఎస్ పదవి దక్కకపోవడానికి అన్యాయాలకు కొమ్ము కాసి, అధికార పార్టీ అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి వంత పాడటమే కారణమని అంటున్నారు. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.