స్పోర్ట్స్‌ డ్రింక్స్‌తో అనారోగ్యం!

Publish Date:May 16, 2018

Advertisement

 

ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ ఆటలలో అలసిపోతే కాస్త దాహం తీర్చుకోవాలని ఎందుకనిపించదు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆటల మధ్యలో అలసట కలిగితే దాహం తీర్చుకునేందుకు స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. మోజుతోనో, దాహం తీరుతుందన్న నమ్మకంతోనో వీటిని తాగేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. కొన్నాళ్లు పోతే కూల్‌డ్రింక్స్‌ తాగినంత తేలికగా స్పోర్ట్స్‌ డ్రింక్స్ తాగే రోజులు వచ్చేస్తాయి. ఇంతకీ వీటి వల్ల ఉపయోగమేనా అంటే... కొంచెం ఆలోచించాల్సిందే మరి!

 

 

- అధికంగా వ్యాయామం చేసినప్పుడో, ఆటలు ఆడినప్పుడో... అలసిపోయేవారి శరీరంలో తిరిగి కావల్సిన నీటిని, శక్తిని అందించడమే ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ లక్ష్యం. కానీ అలా తీవ్రంగా అలసిపోయే ప్రొఫెషనల్ ఆటగాళ్లకి మాత్రమే ఈ పానీయాలు ఉపయోగపడతాయనీ, మిగతావారికి అనవసరమనీ హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

- అధిక శక్తిని ఇచ్చేందుక స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో మోతాదుకి మించి చక్కెర పదార్థాలు ఉంటాయి. ఈ చక్కెర వల్ల పళ్లు దెబ్బతినడం ఖాయమంటున్నారు నిపుణులు. ఒక పరిశోధన ప్రకారం, ఈ పానీయాలు తాగినవారిలో దాదాపు 98 శాతం మంది పంటి పై పొర దెబ్బతిన్నట్లు తేలింది. పంటి పై పొర దెబ్బతింటే అది తిరిగి సరికావడం అంటూ ఉండదు. అంటే స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వల్ల పంటికి శాశ్వతమైన నష్టం కలుగుతుందన్నమాట.

 

- వీటిలోని అధిక చక్కెరల వల్ల త్వరగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వ్యాయామం వల్ల కోల్పోయే శక్తికంటే వీటి నుంచి లభించే శక్తి అధికంగా ఉండటంతో, అదంతా కొవ్వు కిందకి పేరుకుకోవడం సహజమే కదా!

 

- పెద్దల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది! ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌కి అలవాటు పడిన పిల్లలో 90 శాతం మంది పిల్లల పళ్లు దెబ్బతినిపోయినట్లు తేలింది. పైగా ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ తియ్యగా ఉండటంతో పిల్లలకి ఇది ఒక వ్యసనంలా తయారవుతోందట.

 

- వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి కొంత నీరు చెమట రూపంలో బయటకి పోవడం మంచిదే! కానీ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో ఉండే సోడియం, పొటాషియం వంటి పదార్థాల వల్ల ఇలా శరీరం నుంచి మలినాలు బయటకు పోకుండా ఉండిపోతాయి.

 

- స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ చల్లగా తియ్యగా ఉండటంతో కాస్త తాగగానే దాహం తీరినట్లు అనిపిస్తుందే కానీ, శరీరానికి అవసరమైన నీరు లభించదు. దీంతో శరీరానికి తగినంత నీటిని అందించడం అనే అసలైన లక్ష్యం నెరవేరకుండా పోతుంది.

 

- ఈ పానీయాలలో సోడియం నిల్వలు మోతాదుకి మించి ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో తీసుకునే సోడియం (ఉప్పు) శాతమే ఎక్కువగా ఉందంటూ వైద్యులు గోలపెడుతున్నారు. వాటికి ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. ఇలా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ని అధికంగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే సోడియం అధిక రక్తపోటుకీ, గుండెజబ్బులకీ దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

- స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో చక్కెర, సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి పదార్థాలే కానీ విటమిన్లు, ఖనిజాల వంటి పోషక పదార్థాలు ఉండవు. అందుకని శరీరానికి శక్తి లభిస్తుందన్న మాటే కానీ బలం చేకూరదు.

 

వీటన్నింటివల్లా... సాధారణ వ్యాయామం చేసేవారికి స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేదనీ... వాటికంటే మంచినీరు, పాలు, కొబ్బరిబోండాలు, పళ్లరసాలు తీసుకోవడం మేలనీ అర్థమవుతోంది. గంట లోపల వ్యాయామం చేసేవారు కాస్త మంచినీరు పుచ్చుకుంటే సరిపోతుందని మేయో క్లినిక్‌ వంటి సంస్థలు సైతం సూచిస్తున్నాయి.

 

- నిర్జర.

By
en-us Political News

  
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.