స్పీడ్ న్యూస్ 3

Publish Date:Jul 18, 2023

Advertisement

31. తమ సమస్యల పరిష్కారం కోసం గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ  కార్మికులు ఈ రోజు మంత్రి మల్లారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.  తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

..........................................................................................................................................................

32. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 14వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 813 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది.  

.........................................................................................................................................................

33. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ తో  టీఆర్టీ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆఫీసును  ముట్టడించారు. టెట్‌ డీఎస్సీ   ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్‌లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

........................................................................................................................................................

34. వాలంటీర్లతో ఓటర్‌ వెరిఫికేషన్‌ చేయించాలని  సీఎం  జగన్  కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం  సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి  చిన రాజప్ప అన్నారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన ఎల్‌ఏలు చేయాల్సిన పని వాలంటీర్లకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  

.....................................................................................................................................................

35.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  రామచంద్రాపురంలో  అధికార వైసీపీ  నేతల పంచాయితీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో మంత్రి వేణుపై సుభాస్‌ చంద్రబోస్‌   సజ్జలకు ఫిర్యాదు చేశారు.

............................................................................................................................................

36.  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే  కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.  భావసారూప్యత కలిగిన 26 పార్టీలకు చెందిన నాయకులం భేటీ అందుకేనన్నారు.   ప్రజల శ్రేయస్సు కోసం విభేదాలను విస్మరించి పని చేస్తామన్నారు. 

...............................................................................................................................................

37.  కోకాపేటలో బీఆర్ఎస్ కు  11 ఎకరాల భూ కేటాయింపుపై  ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, భారాసకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను  ఆగస్టు 16కి వాయిదా వేసింది.

...............................................................................................................................................

39. రానున్న నాలుగు రోజులలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నగర మేయర్  విజయలక్ష్మి  జోనల్‌ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు.

......................................................................................................................................

40. ములుగు జిల్లా లోని బొగత జలపాతం జలకళను సంతరించుకుంది.   ఇటీవల కురిసిన వర్షాలకు జలపాతంలోకి వరద నీరు వచ్చి చేరడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు పోటెత్తుతున్నారు. 

..........................................................................................................................................................

41. మద్దిరాలలో ఓ రైతు విద్యుత్ షాక్ తో మరణించారు.  నెల్లుట్ల సోమయ్య అనే రైతు రోజూలాగే  వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద ఆన్ చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టి మరణించాడు.   

....................................................................................................................................................

42.  ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం  కొద్ది సేపటికే ఎక్కడ టేకాఫ్ అయ్యిందో అక్కడే ల్యాండ్ అయ్యింది. దీనికి కారణం విమానంలో చార్జింగ్ పెట్టిన ఓ సెల్ ఫోన్ హీటెక్కి  పొగలు కక్కడమే. దీంతో  పైలట్‌ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

...........................................................................................................................................

43. బెంగళూరు వేదికగా జరుగుతున్న బీజేపీయేతర పార్టీల భేటీని  బీజేపీ సీనియర్ నాయకుడు బసనగౌడ పాటిల్   యత్నాళ్‌  దోపిడీ దొంగల భేటీగా అభివర్ణించారు. ఆ భేటీలో పాల్గొంటున్న వారొలో అత్యధికులు అవినీతి ఆరోపణలపై   బెయిలు మీద ఉన్నవారేనని పేర్కొన్నారు.  

...........................................................................................................................................

44. తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందని ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్ రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ వద్దంటూ కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని విమర్శించారు.

................................................................................................................................................

45. రాహుల్‌ గాంధీకి ఎడ్లు, ఎవుసం తెలియదన్న కే టీఆర్‌ వాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మండి పడ్డారు.  విద్యుత్ పై బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్రంలో ఆరు నెలలుగా వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్‌ సరఫరా చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని   డిమాండ్‌ చేశారు. 

............................................................................................................................................

46. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21న నెల్లూరు జిల్లా వెంకటగిరి పర్యటనకు రానున్న నేపథ్యంలో    త్రిభువని సెంటర్లో రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను  అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.   తమ దుకాణాలును తొలగించడం పట్ల   దుకాణా దారులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

47.  ఏపీలో జగన్ సర్కార్ ను గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.  ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన ఆయన తాజా రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో పొత్తు, సీఎం అభ్యర్థి.. వంటి అంశాలపై  కీలక వ్యాఖ్యలు చేశారు.

.................................................................................................................................................

48. తెలంగాణలో  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  ఆయన దీనిపై చర్చకు చింతమడక, సిద్ధిపేట, సిరిసిల్ల ఎక్కడకు రమ్మన్నా వస్తానన్నారు. 

...............................................................................................................................................................

49. తెలంగాణ హైకోర్టులో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చెందిన  ఎస్ఆర్ గార్డెన్  భూముల్లో  ప్రభుత్వం సర్వే చేయించడంపై  పొంగులేటి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు  స్టేటస్ కో ఆర్డర్ జారీచేసింది.  విచారణను అగస్ట్ 1కి వాయిదా వేసింది. 

...............................................................................................................................................

50. కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆరే అంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో  వెలిసిన ఫ్లెక్సీల వెనుక ఉన్నది వైసీపీ నేతలేనని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.  టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగడాన్ని ఓర్చుకోలేకే ఈ ఫ్లెక్సీలు  పెట్టారన్నారు. 

By
en-us Political News

  
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.