స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 20, 2023

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ

11.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని 74 వేల 24 మందిదర్శించుకున్నారు. 32 వేల 688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది.

.......................................................................................................................................................

నిలిచిన వాట్సాప్ సేవలు

12.  ప్రపంచ వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి దాదాపు అరగంట సేపు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.  ఆ తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.

...................................................................................................................................................

టమాటాలతో వెడుతున్న లారీ బోల్తా

13. టమాటాలతో వెళ్తున్న లారీ ఉమ్మడి వరంగల్ జిల్లా  ఆత్మకూరు శివారులోని జాతీయ రహదారిపై  బోల్తా  పడింది. జనం టమాటాలను ఎత్తుకెళ్లకుండా ఆ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్  టమాటా కిలో 150కి పైగా ఉండటంతో డ్రైవర్ గాయాలను సైతం లెక్క చేయకుండా కాపలాగా నిలబడ్డాడు.

.......................................................................................................................................................

ఈటల, అరుణ గృహ నిర్బంధం

14.  హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలనకు  బీజేపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో  ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల ను హైదరాబాద్ లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

................................................................................................................................................

అవసరమైతే తప్ప బయటకు రావద్దు

15. హైదరాబాద్ నగరంలో  ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ  మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. 

.........................................................................................................................................

పని చేయని వాలంటీర్లు మాకొద్దు: ధర్మాన

16. శ్రీకాకుళంలో జగనన్న సురక్షా పథకం కార్యక్రమానికి గైర్హాజరైన వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయని వాలంటీర్లు మాకు అవసరం లేదన్న ఆయన వారిని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

.............................................................................................................................................

విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు

17. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. నేడు రేపు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవలు ఇచ్చినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.   

.........................................................................................................................................................

తెలంగాణలో భారీ వర్షాలు

18. తెలంగాణ రాష్ట్రంలో  నేడూ, రేపూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  బుధవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు నిలిచిపోయింది.

...............................................................................................................................................................

మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘనే: సుప్రీం

19. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై  ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రం, మణిపుర్‌ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని  సుప్రీం  చేసింది. 

...................................................................................................................................................

సిగ్గుపడాల్సిన విషయం: మోడీ

20.మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మెడీ  సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించబోమని మోడీ తేల్చి చెప్పారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

.................................................................................................................................................

విపక్షాల కూటమికి ఇండియా పేరా: విజయశాంతి

21. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ లో  ఓటములు ఎక్కువై విపక్షాల తెలివి ప్రమాదం అంచులు దాటిందని పేర్కొన్నారు. ఆ కూటమి ఓడితే ఇండియా ఓటమి అనాలా అని ప్రశ్నించారు. 

.....................................................................................................................................................

జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు: పురందేశ్వరి

22.   జగన్ పాలనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో  చేసిన అప్పు రూ.2,65,365 కోట్లు అయితే జగన్ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పు రూ.7,14,631 కోట్లని చెప్పారు. జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.

........................................................................................................................................................

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 

23. భద్రాచలం వద్ద  గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతోంది. అప్రమత్తమైన  యంత్రాంగం కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ ,చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. 

..........................................................................................................................................................

ఉస్మానియా పరిధిలో పరీక్షలు వాయిదా

24. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో  గురు, శుక్ర వారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ  ప్రకటించింది.  

............................................................................................................................................

రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి

25.   ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విమానాశ్రయం నుంచే  డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు బాటసింగారానికి బయల్దేరారు.  అయితే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు.

............................................................................................................................................

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

26. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో  ప్రభుత్వం.. యూనిఫాం సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్‌ సహా 31 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మణిపూర్‌లో హింస, ఢిల్లీ ఆర్డినెన్స్‌ సహా పలు అంశాలను  విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తాయి.

...............................................................................................................................................................

వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ షాక్

27. ప్రముఖ స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి  నెట్ వర్క్ పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగించింది. పాస్ వర్డ్ షేరింగ్ వల్ల సంస్థ ఆదాయానికి గండి పడుతోందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.  

.......................................................................................................................................

మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండం : రాహుల్

28. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అంటే ఇండియా మౌనంగా ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. ఆ మేరకు ఆయన ఓ ట్వీట్ లో   ప్రధాని మోడీ నిష్క్రియాపరత్వమే మణిపూర్ ను అరాచకత్వం వైపు నెట్టిందని పేర్కొన్నారు.

....................................................................................................................................

మిజోరంలో కంపించిన భూమి

29. మిజోరంలో  ఈ తెల్లవారు జామున భూమి కంపించింది రిక్టర్ స్కేలుపై ఈ  భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. 

..........................................................................................................................................

30. అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వంతెనపై జరిగిన స్వల్ప ప్రమాదం వద్ద ప్రజలు గుమికూడి ఉండగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.  

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.