స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 20, 2023

Advertisement

యువతను మోసం చేసిన జగన్

1. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర బుధవారం కనిగిరి  నియోజకవర్గంలో సాగింది. ఆయన పాదయాత్ర బుధవారం 2100 కీలోమీటర్ల మైలు రాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను జగన్ మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకా ఏటా జాబ్ క్యలెండర్ విడుదల చేస్తామన్నారు. 

........................................................................................................................................................

ఆసియాకప్ షెడ్యూల్ విడుదల

2. ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను   బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధిపతి జై షా బుధవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా  భారత్-పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది.  ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది.

.....................................................................................................................................................

కేసీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు

3.ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు.   జాతీయస్థాయిలో కేసీఆర్ ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణను పరిపాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాంటున్నారని ధ్వజమెత్తారు. ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఈటల కలిశారు. 

.......................................................................................................................................................

ఈటలకు బీజేపీ హైకమాండ్ మందలింపు

4.బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ను ఆ పార్టీ అధిష్ఠానం మందలించింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ఈటల నిన్న భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతానని ఈటల చెప్పారు. అయితే రాజాసింగ్ ను   కలవడాన్ని తప్పుపట్టిన అధిష్ఠానం ఈటలను మందలించినట్లు సమాచారం.

..................................................................................................................................................

అమిత్ షాతో పవన్ భేటీ

5. ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న భేటీ అయ్యారు.  వీరి మధ్య వివిధ అంశాలపై దాదాపు పావుగంట చర్చ జరిగింది. అనంతరం పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ లో అమిత్ షాతో తన చర్చలు చర్చలు  ఏపీ  ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.

.....................................................................................................................................

బీఆర్ఎస్ కు గద్వాల జడ్పీ చైర్ పర్సన్ రాజీనామా

6. బీఆర్ఎస్ కి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత  రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆమె ఈ రోజు   ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

....................................................................................................................................

విమానంలో ఆక్సిజన్ మాస్క్

7. విమానంలో ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫొటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మొన్న సాయంత్రం సోనియా, రాహుల్ ప్రయాణీస్తున్న విమానం భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో  ఆక్సిజన్ తగ్గి, ఒత్తిడి పెరగడంతో సోనియా ఆక్సిజన్ మాస్క్ ధరించారు. 

.................................................................................................................................

గ్రీన్ చానెల్ ద్వారా కిమ్స్ కు ఊపిరితిత్తులు

8. విజయవాడ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ కు ఊపిరితిత్తుల ను తరలించారు.  వాటిని విమానాశ్రయం నుంచి   సికింద్రాబాద్ నుండి కీమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్ ఏసీపి ఆధ్వర్యంలో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఎటువంటి అంతరాయం లేకుండా చూశారు. 

.........................................................................................................................................................

9. వైసీసీ నుంచి బహిష్కృతురాలైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. త్వరలో ఆమె గుంటూరులో జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ కు పాల్పడ్డారంటూ వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.

..............................................................................................................................................

గుజరాత్ లో నడిరోడ్డుపై మొసలి

10.భారీ  వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన  జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.   గుజరాత్ లోని గిర్ జిల్లాలో ఒక  పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అటవీ అధికారులు ఆ మొసలిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.