స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 21, 2023

Advertisement

పవన్ కల్యాణ్ పై కేసు

1. వాలంటీర్లపై   పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం అంటూ చేసిన వ్యాఖ్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతిని ఇస్తూ  ఏపి ప్రభుత్వ జీవో జారీ చేసింది.    

......................................................................................................................................................

విపక్ష కూటమికి ఇండియా పేరుపై ఫిర్యాాదు

2. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎపై పోటీకి 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి   ఇండియా  కూటమి పేరు ఇండియా సంగతి తెలిసిందే.   ఇండియా పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. 

...........................................................................................................................................................

కేరళ ఆర్టీసీ మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ

3. కేరళ  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేసే మహిళా కండక్టర్లకు కరాటే లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా కండక్టర్లకు విధుల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఎదుర్కొనేందుకు వీలుగా వారికి కరాటేలో తర్ఫీదు ఇవ్వాలని కేరళ సర్కార్ నిర్ణయించింది.  

...........................................................................................................................................................

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

4.  మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. నిన్న రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.1 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదవరి నీటి మట్టం మరింత పెరిగి ఈ రోజు సాయంత్రానికి 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.   

.............................................................................................................................................................

త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ: బొత్స

5. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు అవుతాయని మంత్రి బొత్స తెలిపారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలను  సంప్రదిస్తామని తెలిపారు.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు.

....................................................................................................................................................

రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ 

6. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ నిన్న ప్రకటించింది. ఈ కమిటీలో భట్టి విక్రమార్క సహా 26 మంది ఉన్నారు. ముగ్గుర్ని ఎక్స్-అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ అధిష్ఠానం  నియమించింది.  మొత్తం 29 మందికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది.

.............................................................................................................................................................

నేడూ రేపూ సెలవలు

7. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో   విద్యా సంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ రెండు రోజులూ సెలవు ఇచ్చారు.   ప్రయివేటు సంస్థలకు కూడా రేపు, ఎల్లుండి సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

...................................................................................................................................................

బియ్యం ఎగుమతులపై నిషేధం

8. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దీనిపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌   గురువారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్ల  బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది.

............................................................................................................................................................

ఖర్గేతో ఆర్ కృష్ణయ్య భేటీ

9. బీసీ బిల్లు, వెనుకబడిన వర్గాల డిమాండ్ల సాధనకు సహకరించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కోరారు. గురువారం ఆయన ఖర్గేతో భేటీ అయ్యారు.  బెంగళూరులో నిర్వహించిన విపక్షాల భేటీలో జనగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

......................................................................................................................................................

భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన పువ్వాడ

10.   భద్రాచలం వద్ద గోదావరి వరద పెరగడంతో  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద పరిస్థితిని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం  పువ్వాడ భద్రాచలం చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించారు. వరద తగ్గుముఖం పట్టే వరకూ భద్రాచలంలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.