స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 18, 2023

Advertisement

16. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మూడేళ్ల చిన్నారి  ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న  ఏడాది వయస్సున్న చెల్లి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లి  ఆ పాప మరణించింది.  

..............................................................................................................................................................

17. టమాటాల ధర కొనాలంటేనే భయపెట్టేలా ఉంది. దీంతో టమాటాల దొంగతనాలు పెరిగిపోయాయి. యూపీలోని  నవీన్ సబ్జీ మండిలోని ఓ జాబర్ దుకాణంలో  దొంగలు పడి పాతిక కిలోల టమాటాలను దొంగతనం చేశారు.   ఈ టమాటాల దొంగతనం కలకలం సృష్టించింది.   

....................................................................................................................................................

18.వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.  అలాగే అవినాష్ బెయిలు రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలుతో పాటు వివేకా హత్య కేసు వివరాలు సీల్డ్ కవర్ లో అందించాలని సీబీఐని ఆదేశించింది. 

.........................................................................................................................................................

19. యువత కోసం కుటుంబ పార్టీలు ఎన్నడూ ఆలోచించలేదని  ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే  కుటుంబ పార్టీల అజెండా అని ధ్వజమెత్తారు.ఎజెండా అని ధ్వజమెత్తారు. కుటుంబపాలన కాపాడుకోవడమే ఆ పార్టీల పని అని.. అవినీతిని వారు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు.

............................................................................................................................................................

20. ఈ రోజు తెల్లవారు జామున మరణించిన కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ భౌతిక  కాయం వద్ద కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. అనంతరం ఆయన చాందీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాందీ మృతి తీరని లోటని పేర్కొన్నారు.   

...........................................................................................................................................................

21. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాంది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ  అభివృద్ధికి ఆయన చేసిన కృషి నిరుపమానమని మోడీ  తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  గతంలో ఆయనతో దిగిన ఫోటోలను ప్రధాని ఆ ట్విట్ లో షేర్‌ చేశారు.

.............................................................................................................................................................

  22. కడప రైతు బజారులో రాయతీ ధరకు టమాటాలను అందజేస్తుండటంతో జనం క్యూ కట్టారు. కిలో టమాటాలను రూ.48లకే ఇస్తుండటంతో జనం దాదాపు రెండు కిలో మీటర్ల మేర క్యూలో నిలుచుకున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో టమాటాల ధర రూ.150లకు పైనే ఉంది.  

..............................................................................................................................................................

23. పరువునష్టం కేసులో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌  సీనియర్ నేత రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులోస్టే పడిన శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.  

...............................................................................................................................................................

24.  తొమ్మిదేళ్ల బాలుడిపై నిన్న రాత్రి వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.  వీధికుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

.............................................................................................................................................................

25.  హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమని  తేలిపోయిందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు. షేర్‌ హోల్డర్లను ఉద్దేశించి  ప్రసంగించిన ఆయన  తమ గ్రూప్ కంపెనీలలో ఎలాంటి ఉల్లంఘనలూ లేవని నిపుణుల కమిటీ తేల్చిందని చెప్పారు.   

........................................................................................................................................................

26.అమరావతినే ఏపీకి ఏకైక రాజధానినగా కొనసాగించాలన్న డిమాండ్ తో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు రాజధాని టు రాజధాని పాదాయాత్ర చేపట్టారు. హైదరాబాద్ వనస్థలి పురంలోని పనామా సర్కిల్ నుంచి అమరావతికి ఆయన నిన్న పాదయాత్ర ప్రారంభించారు. 

..........................................................................................................................................................

27. వనపర్తి జిల్లా  అమ్మపల్లి గ్రామంలోకి  పొలం వద్ద ఉన్న పాడుబడిన బావి వద్ద  అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఓ భారీ మొసలి చిక్కుకుంది. భారీ మొసలిని చూసి గ్రమస్థులు ఆందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు ఆ మొసలిని బీచుపల్లి సమీపంలో కృష్ణానదిలో వదిలారు.

...............................................................................................................................................................

28.బీజేపీకి జేడీఎస్‌ బీ-టీమ్‌ అంటూ  విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ నేతలకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు.  నిన్న మీడియాతో  మాట్లాడిన ఆయన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ఏ టీమ్‌కు చెందిన వారో  చెప్పాలని నిలదీశారు.  

.........................................................................................................................................................

29.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి  కుమారుడు మాగుంట రాఘవకు  ఢిల్లీ హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు బెయిలు ఇచ్చింది.  అయితే  రాఘవకు బెయిల్ ఈడీ వ్యతిరేకించలేదు.

.......................................................................................................................................................

30. పవన్ కల్యాణ్ సేవాభావం, పార్టీ విధివిధానాలు నచ్చడం వల్లే ఆ పార్టీలో చేరుతున్నట్లు   వైసీపీ కి ఇటీవలే రాజీనామా చేసిన విశాఖకు పంచకర్ల రమేశ్ బాబు అన్నారు.  రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను తన సొంత డబ్బుతో ఆదుకున్న ఒకే ఒక్క నేత పవన్ కల్యాణ్ అని అన్నారు.  

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.