స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 25, 2023

Advertisement

పోలవరం గేట్లన్నీ ఎత్తివేయండి!

1. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి వచ్చిన వరదను  దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ని తెలంగాణ కోరింది. గత ఏడాది  పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని పేర్కొంది.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం  వాటర్ ఇయర్లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని కోరింది.

...............................................................................................................................................................

పట్టిసీమ ద్వారా నీటి విడుదల

2.  గోదావరిపై పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా  నాలుగేళ్ల తర్వాత నీటిని విడుదల చేశారు. కుడి కాలువలోకి ఆరు పంపుల ద్వారా 2,124 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  2019లో చివరిసారిగా 43.99 TMCల నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చారు.

...........................................................................................................................................................

ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్

3. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని నేతలు ఆరోపించారు.  

..........................................................................................................................................................

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

4. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రస్తుతం ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

..............................................................................................................................................

డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్

5. హైదరాబాద్ లో  ఈ తెల్లవారు ఇక అంబులెన్స్  రోడ్డు డివైడర్ ను ఢీకొంది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలి  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో   డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

........................................................................................................................................................

ఉమ్మడి వరంగల్ లో భారీ వర్షాలు

6. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు  జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 

.....................................................................................................................................................

అత్తాపూర్ లో పిడుగుపాటు

7. హైదరాబాద్‌ అత్తాపూర్ లోని ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడటంతో అపార్ట్‌మెంట్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.  పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

...................................................................................................................................................

జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ వెరీ పూర్

8.  జల్‌జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు సరిగా లేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు.  రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.  

..............................................................................................................................................

పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు

9. పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు. 

......................................................................................................................................................

29న అమిత్ షా తెలంగాణ రాక

10. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు.  కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా రావడం ఇదే మొదటి సారి.

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.