స్పీడ్ న్యూస్

Publish Date:Jul 22, 2023

Advertisement

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.  ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నభక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయటి వరకూ క్యూలైన్ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

............................................................................................................................................................

కాంగ్రెస్ లో  గ్రూపు తగాదాలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం

 

2. కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలున్నాయంటూ బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయిందన్న పొంగులేటి ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పారు.

.........................................................................................................................................................

మోకాలి నొప్పికి రాహుల్ ఆయుర్వేద చికిత్స

 

3. మోకాలి సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. గురువారం  కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంత్యక్రియల్లో పాల్గొన్న తరువాత  శుక్రవారం ఆయన మళపురం జిల్లా కొట్టకల్‌లోని ఆర్య వైద్యశాలను సందర్శించారు.

.............................................................................................................................................

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

4. ప్రకాశం జిల్లా   కొనంకిలో  ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. మరొకరు గాయపడ్డారు.  పాల ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

...............................................................................................................................................

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు: వెలగపూడి

5. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు.  శాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారితో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లపై ఆయన ఆ లేఖలో ఆరోపణలు చేశారు. 

.......................................................................................................................................................

మహా, గుజరాత్ లకు రెడ్ అలర్ట్

6.దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే రానున్న ఐదు రోజుల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ఈ రోజు పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

.....................................................................................................................................................

సొంత ప్రభుత్వంపై విమర్శలు.. కేబినెట్ నుంచి బర్త్ రఫ్

7. రాజస్థాన్ లో మహిళలకు భద్రత కరవైందంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసిన  మంత్రి రాజేంద్ర గూడా ను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి పదవి నుంచి తొలగించారు.  మణిపూర్ హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు సొంత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని  రాజేంద్రగూడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

......................................................................................................................................................

వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం కరవు: తోట

8.   వైసీపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్  ఏపీ  అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిప్పులు కురిపించారు. వైసీపీ  పాలనలో సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.  ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందన్నారు.

...................................................................................................................................................

మళ్లీ ప్రమాద స్థాయిని దాటిని యమనానది ప్రవాహం

9.యమునా నది నీటిమట్టం నిన్న మరోసారి 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటడంతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలను ఢిల్లీ యంత్రాంగం ముమ్మరం చేసింది.  మరింత ఆలస్యమయ్యాయి.  య‌మునా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నది పోటెత్తుతున్నది.  

.....................................................................................................................................................

ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై కోర్టు తీర్పు రిజర్వ్

10. అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.  ఇరు వర్గాల వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.