ముచ్చింతల్‌లో ఇల వైకుంఠం!.. రామానుజ దివ్య‌క్షేత్రం విశేషాలివే...

Publish Date:Feb 5, 2022

Advertisement

అలా వైకుంఠ‌పురం.. ఇలా ఇల‌కు దిగివ‌చ్చిందా అనిపిస్తుంది. మాన‌వ సృష్ఠి వైకుంఠం అది. 216 అడుగుల ఎత్తులో స‌మతామూర్తి ద‌ర్శ‌నం. భ‌గ‌వ‌త్ రామానుజుల 108 అడుగుల విగ్ర‌హం. 18 వేల టన్నుల ప్రతిమ. కూర్చున్నట్టు నిర్మించిన విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. 108 దివ్య దేశాల సంద‌ర్శ‌నం. మూడంత‌స్తుల ‘భద్రవేది’. ఆధ్యాత్మిక‌త‌కు ఆధునిక సాంకేతిక‌త‌ జోడించి.. అత్య‌ద్భుత దివ్య‌క్షేత్రాన్ని నిర్మించారు. ముచ్చింతల్‌లో ‘సమతా మూర్తి’- స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ.

మూడంతస్తుల శ్రీరామానుజాచార్యుల మహా విగ్రహ పీఠాన్ని ‘భద్రవేది’గా పిలుస్తారు. మహా విగ్రహంతో పాటు ఇక్కడ నిర్మాణాలన్నీ సంఖ్యా శాస్త్రం ప్రకారం నిర్మించారు. సంఖ్య, పొడవు, విస్తీర్ణాలకు సంబంధించిన అంకెలు ఏవి కూడినా చివరకు ‘9’ వస్తుంది. రామానుజుల మహా విగ్రహం ఎత్తు 216 అడుగులు.. 2+1+6 కూడితే 9. భద్రవేది ఎత్తు 54 అడుగులు. 5+4=9. ఇలా సంఖ్యాశాస్త్ర స్వ‌రూప‌మే భ‌ద్ర‌వేది. ఇందులో మూడు అంతస్తులుంటాయి. చతురస్రాకృతిలో నిర్మితమై.. మధ్యలో ముఖ భద్రాలతో కూడి ఒక ‘శ్రీ’ యంత్ర ఆకృతిని ఇది పోలి ఉంటుంది. 

మొదటి అంతస్తులో ‘సువర్ణమూర్తి’.. ఇక్కడ రామానుజులు ‘సువర్ణమయ అర్చా మూర్తి’గా కొలువై ఉంటారు. దీనిని ప్రసన్న శరణాగత మండపం అని పిలుస్తారు. శ్రీరామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించినందుకు గుర్తుగా 120 కిలోల బంగారంతో 54 అంగుళాల (4.5 అడుగులు) రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇందులో 36 అంగుళాల ఎత్తైన పీఠం మీద 54 అంగుళాల ఎత్తైన సువర్ణమూర్తి కొలువై ఉంటారు. విగ్రహంపై పంచవర్ణాల విద్యుత్‌ దీపాలు అమర్చడంతో నిత్యం ధగధగలాడుతూ మెరుస్తుంది. ఇక్కడ స్వామికి అభిషేకం, నైవేద్యాలతో నిత్య పూజలు జరుగుతాయి. ఇందులో నక్షత్రాకృతిలో 48 స్తంభాలు; వాటిపై 32 బ్రహ్మవిద్యల శిల్పాలు కనువిందు చేస్తాయి. అలాగే, బంగారు రామానుజుల చుట్టూ ‘మకరానా’ మార్బుల్‌తో ఫ్లోరింగ్‌ నిర్మించారు. మిగతా ప్రాంతమంతా ఇటాలియన్‌ మార్బుల్స్‌తో ఫ్లోరింగ్‌ చేశారు. గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులతో తాపడాలు తొడిగారు. మొత్తం భద్రవేదిని బన్సీ పహడ్‌పూర్‌ పింక్‌ స్టోన్‌తో నిర్మించారు.   

రెండో అంతస్తులో అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వానికి కృషి చేసిన మహనీయుల చరిత్రను ఇ క్కడ ఉంచారు. దీనిని 16,740 అడుగుల విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. మూడో అంతస్తులో ‘పద్మపీఠం’పై రామానుజుల విగ్రహం ఉంటుంది. ఇందులో 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. దీని చుట్టూ 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉంటాయి. అలాగే, 108 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో పీఠం ఉంటుంది. ఇందులోని ఏనుగులు తొండాల నుంచి నీటిని విరజిమ్ముతూ ఉంటాయి. పద్మపీఠంపై పాదాల నుంచి శిరస్సు వరకు 108 అడుగుల ఎత్తులో రామానుజుల విగ్రహం ఉంటుంది. శిరస్సుపై నుంచి త్రిదండం మరో 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ త్రిదండం మొత్తం ఎత్తు 153 అడుగులు.. బరువు 60 టన్నులు. త్రిదండంపైన ఉండే జలపవిత్రం (జెండాలాంటి ఆకృతి) 6 వేల కిలోల బరువు ఉంటుంది. 

ఇంత‌కుముందు ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా శ్రీరామానుజుల వారికి ధ్వజస్తంభాన్ని చినజీయర్‌ స్వామి ప్రతిష్ఠించారు. 504 అంగుళాల ధ్వజస్తంభం అది. రామానుజులు అవతరించిన శ్రీపీఠంలోను, వారు పరమపదించిన శ్రీరంగంలోనూ ధ్వజస్తంభాలు లేవు. ముచ్చింత‌ల్ దివ్య‌క్షేత్రంలో మాత్రం 42 అడుగుల ఎత్తులో ధ్వజ స్తంభం ఉంది. నవగ్రహాలు, ద్వాదశ రాశులతో కూడిన రూపాలను ధ్వ‌జ‌స్థంభానికి తొడుగుగా వేశారు.

ముచ్చింత‌ల్‌లో శ్రీరామానుజుల దివ్య‌క్షేత్ర నిర్మాణాన్ని 2016లో.. 1000 కోట్ల వ్య‌యంతో ప్రారంభించారు. సుమారు 2,700 మంది శిల్పులు శ్రమించారు. 18,000 టన్నుల మహా విగ్రహం నిర్మాణంలో విదేశీయులు కూడా పాల్పంచుకున్నారు. సమతామూర్తి విగ్రహం 200 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

సమతామూర్తి విగ్రహంతో పాటు రామానుజ జీవిత విశేషాలు తెలియచేసే అత్యాధునిక మ్యూజియం.. మహా విగ్రహం చుట్టూ 108 ఆలయాలు.. అందమైన ఉద్యానవనాలు.. సుమారు 4,600 మంది ఏకకాలంలో చూసేందుకు వీలుగా త్రీ డీ షో.. విగ్రహం ముందు మ్యూజికల్‌, లైటింగ్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌.. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 25 కోట్ల వ్యయంతో వాటర్‌ ఫౌంటెయిన్‌ను నిర్మించారు. ఇక్కడ మ్యూజికల్‌ లైటింగ్‌ కోసం ప్రత్యేకంగా 18 నిమిషాల మ్యూజిక్‌ను కంపోజ్‌ చేశారు. లయబద్ధంగా ఫౌంటెయిన్‌, మ్యూజికల్‌ లైటింగ్‌ పని చేస్తుంటాయి. సూర్యాస్తమయం తర్వాత రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను ఈ మ్యూజిక్‌తో 3డీ షో ద్వారా ప్ర‌ద‌ర్శిస్తారు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి కాబ‌ట్టే.. ఇది మ‌రో తెలంగాణ కేంద్రంగా మ‌రో అంత‌ర్జాతీయ ఆధ్యాత్మిక‌ ప‌ర్యాట‌క కేంద్రం కానుంది.

also read: అంత‌పెద్ద రామానుజ విగ్ర‌హం ఎలా త‌యారు చేశారో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.