శ్రీదేవి దూకుడు.. పార్టీలో కుంప‌ట్లు...

Publish Date:Mar 22, 2022

Advertisement

అధికార వైయస్ జగన్ పార్టీలో మహిళ ఎమ్మెల్యేలపై నియోజకవర్గ ప్రజల్లో అసమ్మతి సెగ రాజుకొంది. ఆ క్రమంలో ఇప్పటికే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సదరు నియోజకవర్గంలోని అయిదు మండలాల ప్రజలు.. ఆమెకు పట్టపగలే  చుక్కలు చూపిస్తున్నారన్న టాక్ అయితే చిత్తూరు జిల్లాలో యమ జోరుగా నడుస్తోంది. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా అసమ్మతిని మూట కట్టుకొని.. రోజా బాటలోనే నడుస్తోన్నారనే టాక్ అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా మస్త్ మస్త్‌గా సాగుతోంది. 

తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా నేను మోనార్క్... అనే స్టైల్‌లో వ్యవహరిస్తోండడంతో.. నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా.. ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సమాచారం.  అందుకే సదరు ఎమ్మెల్యేపై వారంతా తిరుగుబాటుకు తెర తీశారనే చర్చ సైతం నియోజకవర్గంలో హాట్ హాట్‌గా నడుస్తోంది. 

ఎమ్మెల్యే శ్రీదేవి దూకుడుకు సొంత పార్టీలోని వారే అల్లాడిపోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే మాత్రం.. ఆమె ఓటమికి గల కారణాలను దయచేసి మమ్మల్ని అడగవద్దంటూ .. సదరు నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ ఎస్సీ  నేతలు.. ఆ పార్టీ అగ్రనేతలతో పేర్కొన్నట్లు తాడేపల్లి ప్యాలెస్‌ సాక్షిగా ఓ టాక్ అయితే నడుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే శ్రీదేవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి నేతలంతా ఓ తీర్మానం కూడా చేశారట. అంతేకాదు.. ఆమెపై వారంతా ఆరోపణలను సైతం సంధిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోంటున్నారని... వాలంటీర్ ఉద్యోగాలు సైతం అమ్ముకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదని.. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తల కుటుంబాలను సైతం ఆమె పట్టించుకోరని.. అలాగే అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసేలా.. ప్రయత్నాలు కూడా ఆమె చేయరని.. క్షేత్రస్థాయిలోని నేతలంతా మరీ గుర్తు చేస్తున్నారు. 

ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమె వ్యవహారశైలి వివాదాస్పదమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి ఆమె కేడర్‌ను దూరంగా పెట్టడం.. అక్కడితో ఆగకుండా.. తన చుట్టు కోటరి ఒకటి ఏర్పాటు చేసుకుని.. నియోజకవర్గంలో నాయకులను రెండు గ్రూపులుగా విభజించారనే ఓ చర్చ అయితే ఎప్పటి నుంచి ఉంది. ఏమైనా అంటే జగన్‌ అండ్ కో వద్ద తనకు బాగా పలుకుబడి ఉందని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. ఆమె బాహాటంగానే వ్యాఖ్యానిస్తుంటారన్న స్థానిక పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం. 

తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ వారిపైన కూడా పోలీసు కేసులు పెట్టించడం ఆమెకు ఓ రివాజుగా మారిందనే టాక్ అయితే తాడికొండలో ఉంది. పనులు చేసే కాంట్రాక్టర్లను సైతం ఆమె వదలరని.. కమిషన్లు పేరుతో నానా హడావుడి చేస్తారని అంతా అంటున్నారు. ఎంపీ నిధులతో జరుగుతున్న పనులకు సైతం తనకు కమిషన్లు ఇవ్వాలంటే అజమాయిషీ చెలాయిస్తారని.. అలా అయితే ఎలా అంటూ సదరు కాంట్రాక్టర్లు.. పనులు సైతం నిలిపివేసి.. ఎమ్మెల్యేపై చర్యలకు పట్టుపట్టడం గతంలో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇదే అంశంపై స్థానిక ఎంపీతో కూడా ఆమె ఘర్షణకు దిగినట్లు సమాచారం. మరోవైపు రాజధానిపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేయడం పట్ల అమరావతి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఐఏఎన్ఎస్ ‌- సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే గతేడాది అక్టోబర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సర్వే చెప్పింది అక్షరాల సత్యమని... రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరే అందుకు తాజా ఉదాహరణ.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.