మహామహుల నేలలో బూతులు, క్యాసినోలా!? గుడివాడ గొప్ప‌త‌నం తెలుసా..

Publish Date:Jan 19, 2022

Advertisement

గుడివాడ.. ఇదో బ్రాండ్ నేమ్.. మహామహులకు పుట్టినిల్లు.. చైతన్య సాహితీ వికాసాల ఘనకీర్తి.. జాతిపిత పూజ్య బాపూజీ నడయాడిన నేల.. సినీ వినీలాకాశంలో ధ్రువతారలు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఘంటసాల పురిటిగడ్డ గుడివాడ. నక్సలైట్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్యదీ ఇదే నేల. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి హోమియో కళాశాల నెలకొల్పిందీ ఇదే గుడివాడలోనే. వ్యవసాయ సంబంధ పరికరాల తయారీకి మారుపేరు కూడా ఈ గుడివాడదే.. అంతటి ఘన చరిత్ర ఉన్న గుడివాడ ప్రాభవం ఇప్పుడు మసకబారిపోతోందని స్థానికుల్లో ఆవేదన పెరిగిపోతోంది. గాంధీ నడయాడిన గడ్డ ఇప్పుడు జూదాలు, పేకాటలు, క్యాసినోలు, బూతులకు చిరునామాగా మారిపోయి, అపకీర్తిని మూటగట్టుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన గుడివాడ.. రాజకీయ, సినీ రంగాలకు ఎందరో మహామహులను అందించిన గడ్డ. వారంతా గుడివాడకు ప్రపంచ స్థాయిలో ఘన కీర్తి తెచ్చిపెట్టారు. ఇప్పుడదే గుడివాడను ‘బూతుల నేత ఊరేనా?.. పేకాటలు, గోవా తరహా క్యాసినోలు నడిచిందక్కడే కదా’ అని గుర్తు చేసుకోవాల్సిన దుస్థితికి తెచ్చారు గుడివాడ నేతలు అంటూ స్థానికులు నోళ్లు నొక్కుకుంటున్నారు.

ఒకప్పుడు గుడివాడ.. ‘విదర్భపురి’ పేరుతో భాసిల్లింది. అనేక గుడులు ఉన్న ఈ నేల గుడులవాడగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా  అది గుడివాడగా మారింది. వర్తక, వాణిజ్యాలు, విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులతో విలసిల్లింది గుడివాడ. వాస్తవానికి కృష్ణా జిల్లా రాజకీయం మొత్తం గుడివాడ చుట్టూనే తిరిగేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీని మూడుసార్లు ఆకర్షించింది గుడివాడ గడ్డ. ఇక్కడి ప్రజల స్వాతంత్ర్యోద్యమ చైతన్యాన్ని చూసి ముగ్ధుడైన గాంధీజీ 1921, 1923, 1933 సంవత్సరాల్లో గుడివాడ వచ్చారు. గాంధీ స్ఫూర్తితో గుడివాడ వాసి గూడూరి రామచంద్రుడు హరిజనాశ్రమం నిర్మించారు. ఈ విషయం గాంధీజీయే స్వయంగా 1921లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గుడివాడ విశేషం.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటరత్న ఎన్టీ రామారావు పుట్టింది గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులో. 1983లో తన రాజకీయ ఆరంగేట్రం చేసింది కూడా గుడివాడ శాసనసభా స్థానం నుంచే. 1985లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తన హయాంలో గుడివాడ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుదీ గుడివాడ ప్రాంతం నందివాడ మండలం వెంకట రాఘవాపురంలో పుట్టారు. గుడివాడలో ఆయన సమకూర్చిన నిధులతో ఏఎన్నార్ పేరుతో ఓ డిగ్రీ కళాశాల నడుస్తోంది. ఇక అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఇదే నియోజవర్గం చౌటపల్లిలో జన్మించారు. ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కూడా ఈ ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం అయ్యారు.

తొలి తరం మావోయిస్టు ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, సినీ ఫొటోగ్రాఫర్ వీఎస్సార్ స్వామి, సినీ గేయాలకు సాహిత్యశోభ అద్దిన మల్లాది, విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు, ప్రసిద్ధ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గుడివాడ నియోజకవర్గంలో జన్మించినవారే. బౌద్ధ వాంగ్మయ బ్రహ్మ దుగ్గిరాల బలరామకృష్ణయ్య, ప్రసిద్ధ సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం, కె.ప్రత్యగాత్మ, దుక్కిపాటి మధుసూదన్ రావు, ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు, సాహితీవేత్త త్రిపురనేని హనుమాన్ చౌదరి కూడా గుడివాడ వారే.

ఇంతటి ఘన చరిత్ర ఉన్న గుడివాడ కీర్తి ఇప్పుడు మసకబారిపోతోందే అనే ఆవేదన స్థానికుల్లో ఎక్కువైపోతోంది. నోరు విప్పితే బూతులు మాట్లాడే నేత.. జూదగృహాలు, క్యాసినోలు, భూ కబ్జాలు, గడ్డం గ్యాంగులు గుడివాడ ఘన చరిత్రను దిగజారుస్తున్నాయని ప్రతి ఒక్కరిలో అసంతృప్తి రగిలిపోతోంది. సరదాల సంక్రాంతి పండుగ నెపంతో విదేశీ క్యాసినో సంస్కృతిని దిగుమతి చేసుకున్న నగరం అని ఇప్పుడు జనం నోళ్లలో నానిపోతోంది గుడివాడ. పచ్చని పొలాలు, చల్లటి చెరువుగట్లు, శుభ కార్యాలతో కళకళలాడే ఫంక్షన్ హాళ్లతో ఉండే గుడివాడలో ఇప్పుడవన్నీ రాజకీయ పెద్దల మద్దతుతో పేకాటలు, గుండాటలకు నిలయాలుగా మారిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.