వైసీపీలో నిజం మాట్లాడితే నిష్ఠూరమే.!

Publish Date:Jul 15, 2026

Advertisement

రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడే హాట్ టాపిక్కే.. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం  చుట్టూ జరిగే రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మలుపులు తిరుగుతుంటాయి. వైసీపీ హయాంలో  దాదాపు  3 వేల 850 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ పథకానికి అంకురార్పణ జరిగింది. అయితే..  ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కీలక ప్రాజెక్టును పక్కన పెట్టేసిందని వైసీపీ ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తోంది.

తెలుగుదేశం కూటమి సర్కార్ తీరు వవల్ల సీమకు 101 టీఎంసీల నీరు అందకుండా పోతోందని వైసీపీ నిప్పులు చెరుగుతోంది. అయితే వైసీపీ వాదన, విమర్శలలోని డొల్ల తనాన్ని ఆ పార్టీకే చెందిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇటీవల జరిగిన వైసీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి.. సీమ జల ప్రయోజనాల రక్షణ విషయంలో చేయాల్సినదేమిటన్న విషయంపై నిష్కర్షగా మాట్లాడారు.

ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది. అంతే వెంటనే తెలుగుదేశంతో కుమ్మక్కు అంటూ కథలల్లేయడం మొదలెట్టింది వైసీపీ. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ..విశ్వేశ్వరరెడ్డి.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ చెప్పుకొచ్చారు.   తాము రాయలసీమ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని చెప్పారు.

అయితే ఆ సందర్భంగా ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూసిన ఎవరైనా ఆయన చేత బలవంతంగా అలా చెప్పించారన్న అభిప్రాయానికే వస్తారు. అందుకే ఆయన ఎంత వివరణ ఇచ్చినా  ఎవరూ నమ్మడం లేదు. సీమ ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్ పాలన జరిగిందని.. స్వయంగా వైసీపీ సీనియర్ నేతే అంతర్గత సమావేశంలో చెప్పడం అధికార తెలుగుదేశం కూటమికి తమ వాదన మరింత బలంగా వినిపించే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే  తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు వేదికగా   జగన్ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రాయలసీమ నీటి ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు చేసి, అందులో కనీసం 40 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా నీటి వనరుల శాఖను నిర్వీర్యం చేశారని గణాంకాలతో సహా వివరించారు.  అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గ్రీన్ ట్రైబ్యునల్ ఆపివేసింది జగన్ పాలనలోనే కదా అని ప్రశ్నించారు. మొత్తం మీద జగన్ హయాంలో సీమ ప్రయోజనాలకు భంగం వాటిల్లిందనీ, జగన్ విధానాలే అందుకు కారణమన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.  

ysrcp internal rift, y visweswara reddy, rayalaseema lift irrigation scheme

By
en-us Political News

  
భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 9,795 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు నిపుణుల ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
టాటా ఎల్క్సీ Tata Elxsi Q1 ఫలితాల తర్వాత షేరు 6% క్రాష్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై సెల్ రేటింగ్ ఇస్తూ, ఇంకా 16% మేర పతనమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాలు మరియు మార్జిన్ల లెక్కలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.