జనంపై స్పీకర్ శివాలు.. ఖర్మరా రాష్ట్రానికి!

Publish Date:Jun 30, 2023

Advertisement

జగన్ ఏ ముహూర్తాన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో కానీ అప్పటి నుంచీ వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి పరాభవాలు ఎదురయ్యాయి. వారి నిరసనాగ్రహాన్ని తట్టుకోలేక  చాలా మంది ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. లేదా ఏదో చేశామన్నట్లుగా మమ అనిపించేశారు.

అయితే ఆ కార్యక్రమంపైనే ఆశలు పెట్టుకున్న జగన్ వర్క్ షాపులు పెట్టి, టికెట్టివ్వబోనని ఎమ్మెల్యేలనూ, పదవులు ఊడబెరికేస్తానని మంత్రులను హెచ్చరించి, బెదరించి మరీ వారిని జనం ముందుకు తోలారు. ఒక ఒక విధంగా బలవంతంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు తోశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు  మాత్రం ఆ కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని చవిచేసి కొన్ని చోట్ల పారిపోతే, మరికొన్ని చోట్ల ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసి చులకన అయ్యారు. తాజాగా ఆ కోవలోకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేరారు. ఆ జాబితాలోకి మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చేరారు.  వీరిరువురూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రజలపై విరుచుకుపడిన తీరును గమనించిన వారంతా ఇదేం ఖర్మరా బాబూ మన రాష్ట్రానికి అంటూ తలలు బాదుకుంటున్నారు.

పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ ప్రచారాలకు దూరంగా ఉండాల్సిన స్పీకర్ తమ్మినేని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏకంగా తనకు ఓటేయని వారు తనను ప్రశ్నించేందుకు అర్హత లేని వారేనని బాహాటంగా చెప్పేశారు. అంతే కాదు ఈ విషయం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పో అంటే ఓ మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ విలువలకూ, విధానాలకూ తిలోదకాలిచ్చేసినట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఇసుమంతైనా లెక్క చేయకుండా సంక్షేమ సొత్తు పందేరాలపైనే పూర్తి ఆశలు పెట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. అందుకు అనుగుణంగానే ప్రజా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదరింపులకు దిగడానికి కూడా వెనుకాడటం లేదు.  

ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పార్టీలు తమ అస్త్రాలను బయటకి తీస్తున్నారు. టీడీపీ పాదయాత్రలు, జనసేన వారాహి యాత్ర, వైసీపీ గడప గడపకి కార్యక్రమాలతో ప్రజలలోకి వెడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కార్యక్రమాలకు, యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే.. గడప గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రజల వద్దకు వెడుతున్న  వైసీపీ నాయకులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చక పోగా,మంత్రులు, ఎమ్మెల్యేలు,వచ్చి హడావుడి చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఉపయోగపడే ఒక్క పనికూడా ప్రభుత్వం అమలు చేయలేదని ప్రజలు  బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు , నవరత్నాలు,సంక్షేమ పథకాలు , ప్రజలకి ఉపయోగ పడే ఏఒక్క పనిని కూడా చేయలేదంటూ మండిపడుతున్నారు. 

 మంత్రి ఆదిమూలపు సురేష్ కు సొంత నియోజక వర్గం రామాసముద్రంలో నిరసన సెగలు తగిలాయి. రైతులకు ఇచ్చే ఉపకరణాలు పంపిణి జరిగాక, తిరిగి వెళ్తున్న క్రమంలో చేదు అనుభవ ఎదురైంది. ఏ మొకం పెట్టుకొని వచ్చారు అని మహిళలు చుట్టూ ముట్టారు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాక గ్రామంలోకి అడుగు పెట్టాలని, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేసారు.  ఊహించని పరిణామంతో కంగు తిన్న మంత్రి అక్కడనుండి  జారుకున్నాడు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులే తమ జేబులు నింపుకున్నారని, ప్రజలకి వైసీపీ చేసిందేమి లేదని జనం నిర్బయంగా మంత్రుల ఎదుటే చెబుతుండటంతో వైసీపీ నేతలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్ల లేక.. జగన్ కు సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.