వైన్ అంటేనే సంథింగ్ స్పెషల్. బ్రాంది, విస్కీలకంటే డిఫరెంట్. విదేశాల్లో వైన్‌కు ఫుల్ క్రేజ్. ఇక ఫ్రెంచ్ వైన్ అన్నిటికంటే బెస్ట్. ఎంత పాత వైన్ అయితే అంత టేస్ట్. వైన్ ఎంతగా మాల్ట్ అయితే అంత కాస్ట్. వైన్‌కు ప్రత్యేక రుచి తీసుకొచ్చేందుకు.. భూగర్భంలో నేలమాలిగల్లో వైన్‌ను ఏళ్ల తరబడి పులియబెడతారు. బాగా పులిశాక.. అందమైన బాటిల్స్‌లో అమ్ముతుంటారు. అంత కష్టం, అంత రుచి, అంత ప్రత్యేక వాసన ఉంటుంది కాబట్టి.. ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో బాటిల్ లక్షల్లో ధర పలుకుతుంది. కానీ, ఇప్పుడు చెప్పబోయే వైన్ బాటిల్ వీటన్నిటికంటే చాలా చాలా స్పెషల్. అందుకే ఆ బాటిల్‌కు ఏకంగా 7 కోట్లకు పైగా చెల్లించేందుకు వైన్ లవర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంతకీ, ఆ వైన్ స్పెషాలిటీ ఏంటంటే...
అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్. అందుకే దాని ధర కూడా ఆకాశమంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో ఏడాదికిపైగా ఆ వైన్‌ను మాల్ట్ చేశారు. ఆ ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను ఇప్పుడు క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు 7.37 కోట్లు) పలకొచ్చని భావిస్తోంది.
2019 నవంబరులో అంతరిక్షంలోకి 12 వైన్ సీసాలను పంపించారు. అందులోని ఒక బాటిల్‌నే ఇప్పుడు వేలం వేస్తున్నారు. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత ఆ బాటిల్స్‌ను తిరిగి భూమికి తీసుకొచ్చారు. వీటికి ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ వైన్ అండ్ వైన్ రీసెర్చ్‌లో పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. అంతరిక్షంలో మాల్ట్ చేసిన వైన్.. స్మూత్‌గా, సువాసన భరితంగా ఉందని తేల్చారు. గురుత్వాకర్షణ లేని చోట ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్ ‘పరిపక్వానికి’ వచ్చింది కాబట్టి ఆ వైన్ టేస్ట్ అదుర్స్ అంటున్నారు. అందుకే, ఆ వైన్ బాటిల్ వేలంలో 7 కోట్లకు పైగా ధర పలకొచ్చని చెబుతున్నారు. ఆ వైన్ బాటిల్‌కు ఓ పేరు కూడా ఉంది. ‘పెట్రస్ 2000’.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/space-travel-petrus-wine-costs-7-crore-rupees-25-114888.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.