తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా?

Publish Date:Jun 20, 2026

Advertisement

తెలంగాణ ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని   పరిశీలిస్తే ఒక  చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా చలామణి అవుతున్న శక్తుల మధ్య స్పష్టమైన పొలిటటికల్ వాక్యూమ్  ఏర్పడిందని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి, కాదంటే..  బలమైన ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఉన్నాయా? అన్నచర్చ రాష్ట్రరాజకీయాలలో జోరుగా 
సాగుతోంది. 

దేశవ్యాప్తంగా లేదా ఇతర రాష్ట్రాల్లో ఒక పార్టీ బలహీనపడితే మరో పార్టీ పుంజుకోవడం సాధారణం..  కానీ తెలంగాణలో  అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటిపైనా ప్రజల్లో  అసంతృప్తి వ్యక్తమవున్న పరిస్థితి. ఇక ఈ రెండూ కాకుండా బీజేపీ కూడా తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నట్లుకనిసిస్తున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. హైదరాబాద్మినహాయిస్తే.. బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది.   దీంతో ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తరహా కేంద్రీకృత పాలనకు భిన్నమైన పరిపాలనను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో ఆ మార్పులు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  తెలంగాణ మౌలిక ప్రయోజనాలను, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల తెలంగాణ సమాజంలోని మేధావులు, ఉద్యమకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

మరోవైపు, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్  పరిస్థితి కూడా ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకత్వం తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లోనే కనిపిస్తోంది.  ముఖ్యంగా పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేటీఆర్ శైలి తెలంగాణ సంస్కృతికి, ఇక్కడి మట్టి మనుషుల ఆలోచనలకు దూరంగా కార్పొరేట్ తరహాలో ఉంటోందనే విమర్శలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వస్తున్నాయి4.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత సొంతంగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. అయితే ఆమే ముందుకు సాగడానికి  పాత నీడలు,  వివాదాలు ఆమెను వెన్నాడుతున్నాయి. ఆమె జోరుకు ఇవిసహజంగానే అవరోధాలుగా ఉన్నాయి. దీంతో  టీఆర్ఎస్,  బీఆర్‌ఎస్కు  ప్రత్యామ్నాయంగా ఎదిగే  విషయంలో వెనుకబడుతోంది. 

ఈ వ్యూహాత్మక రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జరిగిన కొన్ని చారిత్రక ప్రయోగాలను మేధావులు గుర్తుచేస్తున్నారు. గతంలో దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఏర్పాటైన 'మహాజన ఫ్రంట్' తరహా ప్రయోగం ప్రస్తుత తెలంగాణలో అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మైనారిటీ వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి, మహిళా లోకాన్ని భాగస్వామ్యం చేస్తూ ఒక బహుజన ఫ్రంట్ లేదా విస్తృత సామాజిక వేదికను ఏర్పాటు చేయడానికి తెలంగాణలో స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నికల వేళ సీట్ల సర్దుబాట్లు, సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఒక చక్కని వేదిక కాగలదని విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ అధికారమే పరమావధిగా కాకుండా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వం కోసం ఒక పటిష్టమైన ఎజెండాతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు.  ఈ అనుకూల సమయాన్ని సామాజిక శక్తులు సరిగ్గా ఉపయోగించుకోకపోతే, తెలంగాణ రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.