నైరుతి గుడ్ బై చెప్పేసింది: లోటు వర్షపాతమే కానీ.!

Publish Date:Sep 26, 2026

Advertisement

నైరుతి రుతుపవనాలు గుడ్ బై చెప్పేశాయి . ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది. సీజన్ మొత్తం మీద గతంలో 20 శాతంగా ఉన్న లోటు, ఈ తాజా వర్షాల కారణంగా 15 శాతానికి చేరింది. సెప్టెంబర్ 22వ తేదీ వరకు రాష్ట్రంలో ఏకంగా 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే గత నాలుగు రోజుల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ నెల లోటు  4 శాతానికి పడిపోయింది. ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో సగటున  52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

అదలా ఉంటే.. గత నాలుగు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా  భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం  పెరుగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 25) సాయంత్రానికి 20.2 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం,   శనివారం (సెప్టెంబర్ 26) ఉదయానికి  30 అడుగులకు చేరకుంది.   అలాగే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు  వరద నీరు పోటెత్తడంతో అధికారులు   15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు, భూపాలపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షపు నీరు భూగర్భ గనుల్లోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి  అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో, శనివారం (సెప్టెంబర్ 26) నుంచి రాష్ట్రంలో మళ్లీ ఉక్కపోతతో కూడిన వాతావరణం మొదలైంది.  


[Southwest Monsoon, Telangana Rains, Rainfall Deficit, Bhadrachalam Godavari, Talipet Project, Telangana Weather, Telugu One]

By
en-us Political News

  
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
ఒక వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాల్లో మొదలైన వివాదాన్ని.. ఏకంగా ఇరువర్గాల మధ్య గొడవగా మార్చింది.
ఊరేగింపులో భాగంగా భారీ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టర్   వాహనం సమీపంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు  వాహనం కింద పడిపోయాడు. అక్కడున్న వారు గమనించి, స్పందిం చేలోపే ఆ యువకుడి పైనుంచి వాహనం దూసుకెళ్లడంతో  తీవ్రంగా గాయపడి మరణించాడు.
హోరాహోరీ వేలంలో సామ ప్రణీత్ రెడ్డి .39 లక్షల రూపాయల రికార్డు ధరకు బాలాపూర్ గణేశుడి లడ్డూ  సొంతం చేసుకున్నారు.    ప్రతి ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సాగుతున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ సారి మరో కొత్త రికార్డు సృష్టించింది
చివరి నిమిషంలో చేపట్టవలసిన కొన్ని సాంకేతిక వెల్డింగ్ పనులు, తదితర ముగింపు ఏర్పాట్ల కారణంగా ఉదయం యాత్ర ఆరంభం కావడంలో ఒకింత జాప్యం జరిగింది. అయితే ముందుగా నిర్ణయంచిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా పూర్తవుతుందని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.  
ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేస్తున్న  ప్రజా సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానాలకు గాను ఆర్యడన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. 
దీనికి తోడు.. ఏయే జిల్లాల పరిధిలోని భూముల గురించి విచారణ జరుగుతుందో, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆయా కేసుల విచారణ సమయంలో ఈ కమిటీలో సభ్యులుగా భాగస్వాములు అవుతారు.   అసెంబ్లీలో  రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద జరిగిన చర్చల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.