ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం: సామాజిక న్యాయమే లక్ష్యం : సీఎం రేవంత్

Publish Date:Sep 25, 2026

Advertisement

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఆమె 131వ జయంతి సందర్భంగా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత‌ ఇస్తోందని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్‌ సైరన్‌ మోగించారని సీఎం గుర్తుచేశారు. 

సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. కోఠిలోని మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మరించుకున్నామని సీఎం చెప్పారు. ఐలమ్మతో పాటు తెలంగాణ వీర మహిళలు చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని అన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

 

[ Chakali Ilamma, Revanth Reddy, Telangana Armed Struggle, Social Justice, Telangana Government, BC Welfare, Women Empowerment, Equality, Telangana History, Backward Classes Welfare ]

By
en-us Political News

  
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
ఒక వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాల్లో మొదలైన వివాదాన్ని.. ఏకంగా ఇరువర్గాల మధ్య గొడవగా మార్చింది.
ఊరేగింపులో భాగంగా భారీ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టర్   వాహనం సమీపంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు  వాహనం కింద పడిపోయాడు. అక్కడున్న వారు గమనించి, స్పందిం చేలోపే ఆ యువకుడి పైనుంచి వాహనం దూసుకెళ్లడంతో  తీవ్రంగా గాయపడి మరణించాడు.
హోరాహోరీ వేలంలో సామ ప్రణీత్ రెడ్డి .39 లక్షల రూపాయల రికార్డు ధరకు బాలాపూర్ గణేశుడి లడ్డూ  సొంతం చేసుకున్నారు.    ప్రతి ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సాగుతున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ సారి మరో కొత్త రికార్డు సృష్టించింది
చివరి నిమిషంలో చేపట్టవలసిన కొన్ని సాంకేతిక వెల్డింగ్ పనులు, తదితర ముగింపు ఏర్పాట్ల కారణంగా ఉదయం యాత్ర ఆరంభం కావడంలో ఒకింత జాప్యం జరిగింది. అయితే ముందుగా నిర్ణయంచిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా పూర్తవుతుందని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.  
ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేస్తున్న  ప్రజా సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానాలకు గాను ఆర్యడన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. 
దీనికి తోడు.. ఏయే జిల్లాల పరిధిలోని భూముల గురించి విచారణ జరుగుతుందో, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆయా కేసుల విచారణ సమయంలో ఈ కమిటీలో సభ్యులుగా భాగస్వాములు అవుతారు.   అసెంబ్లీలో  రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద జరిగిన చర్చల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.
తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియను ఎంతోకాలంగా వేధిస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాజకీయ ఫిరాయింపులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.