రాబడిలో దేశంలోనే నంబర్ వన్ విశాఖ రైల్వే జోన్.!

Publish Date:Aug 7, 2026

Advertisement

పారిశ్రామిక, రవాణా రంగాల లోనే కాకుండా భారతీయ రైల్వే చరిత్రలోనూ విశాఖపట్నం రికార్డు సృష్టించింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే   జోన్ సరికొత్త చరిత్ర సృస్టించింది.  అతి స్వల్ప కాలంలోనే  విశాఖ రైల్వే జోన్   రికార్డు స్థాయి రాబడి సాధించింది.  దక్షిణ కోస్తా రైల్వే జోన్  వార్షికంగా   2వేల 493 కోట్ల నికర రాబడిని సాధించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా   నిలిచింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ  ప్రకటనలో అధికారికంగాప్రకటించింది. సుదీర్ఘకాల  నిరీక్షణ తర్వాత ఏర్పాటైన విశాఖ జోన్, ఇప్పుడు దేశంలోని ఇతర పాత రైల్వే జోన్లకు గట్టి పోటీఇవ్వడమే కాకుండా రాబడిలో వాటిని అధిగమించే స్థాయికి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  54 వేల  కోట్ల విలువైన వివిధ రైల్వే ఆధునీకరణ, లైన్ల విస్తరణ,  కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 71 వేల  కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు భారీ రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి.  వీటితో   రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం   కోటీ పాతిక 25 లక్షల కోట్లకు పైగా రైల్వే పెట్టుబడులు ప్రవాహంలా రానున్నాయి.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా విశాఖ  ప్రధాన రైల్వే యార్డ్ విస్తరణ,  ఆధునీకరణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ యార్డ్ ఆధునీకరణ కోసం రైల్వే శాఖ  300 కోట్ల రూపాయలు కేటాయించింది.   ప్రయాణికుల రద్దీని తట్టుకోవడం, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కింద 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లను నిర్మిస్తున్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తే విశాఖ స్టేషన్ నుండి   దూరప్రాంత సర్వీసులను మరిన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. అలాగే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ యార్డ్ ఆధునీకరణ ఎంతగానో దోహదపడనుంది.

రైల్వే కనెక్టివిటీ,  సరుకు రవాణా  సులభతరం చేసేందుకు ప్రధాన మార్గాల్లో ట్రాక్‌ల విస్తరణ పనులను వేగవంతం చేశారు. అందులో భాగంగా గుంతకల్ - బళ్లారి మార్గంలో నాలుగు లైన్ల విస్తరణ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.  ఈ  లైన్ విస్తరణ వల్ల పరిశ్రమలకు బొగ్గు, ఇనుప ఖనిజం తదితర సరుకుల రవాణా   వేగంగా సాగడమే కాకుండా, ప్యాసింజర్ రైళ్ల సమయపాలన గణనీయంగా మెరుగుపడుతుంది.  

South Coast Railway Visakhapatnam Zone,  Visakhapatnam Railway Revenue Record,  AP Railway Projects2026,  Visakhapatnam Railway Yard Modernization, TeluguOne 

By
en-us Political News

  
అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
లైనక్స్ వినియోగదారుల కోసం NordVPN వర్షన్ 5.3.0 నూతన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆటోమేటిక్ GUI యాప్ ఇన్స్టాలేషన్, కొత్త డయాగ్నోస్టిక్స్ కమాండ్ మరియు సిస్టమ్ సపోర్ట్ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోండి.
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది.
దశాబ్దాల నాటి పాత ఎస్‌క్యుఎల్ ఇంజెక్షన్ లోపం మరియు ఒరాకిల్ డేటాబేస్ ట్రిక్ ఉపయోగించి హ్యాకర్లు విండోస్ సర్వర్లను ఎలా హైజాక్ చేస్తున్నారో తెలుసుకోండి. ఖంట్ టూల్‌కిట్ ప్రమాదం మరియు సెక్యూరిటీ రక్షణ చిట్కాలు ఇక్కడ చూడండి.
ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు డీకే శివకుమార్ 3 కొత్త భారీ పార్కులను ప్రకటించారు. 452 ఎకరాల వైమానిక దళ స్థలంతో పాటు నగర అటవీ ప్రాంతాల్లో లాల్‌బాగ్ తరహా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఐకియా, డెలాయిట్ సమీపంలోని రూ. 2,000 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కోర్టు వివాదాల వల్ల 15 లక్షల టన్నుల అక్రమ డంపింగ్ యార్డ్‌గా మారిన పూర్తి కథనం.
హైదరాబాద్ బస్తీల నుంచి టీమిండియా స్టార్ బౌలర్‌గా, తెలంగాణ డీఎస్పీగా ఎదిగిన మహమ్మద్ సిరాజ్ స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ, ఆస్తుల విలువ, ఐపీఎల్ సంపాదన మరియు బ్రాండ్ డీల్స్ వివరాలు.
పాకిస్థాన్ హోంమంత్రి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో గత ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. , దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని తాను బయటపెట్టానని, అందులో ప్రముఖ రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.
భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టీవ్ వా, అభిషేక్ బచ్చన్ యజమానులుగా ఉన్న ఈ జట్టులో రహానే సరికొత్త ఇన్నింగ్స్ వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే అత్యంత ప్రాధాన్యమైన పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నీట్ పరీక్ష లీకేజీ వివాదాలు దానికి అనుబంధంగా జరిగిన నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.