ఆపరేషన్ సిందూర్ హీరోలకు వీర చక్ర పురస్కారాలు

Publish Date:Oct 22, 2025

Advertisement

దేశ రక్షణలో   విశిష్ఠ‌ సేవలు అందించడంతో పాటు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన  భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది.  ఆపరేషన్ సిందూర్  సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక  వీర చక్ర  పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన 1988  మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్‌కు వీర చక్ర లభించింది. అదే విధంగా అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని చాటిన 302 మీడియం రెజిమెంట్‌కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబాకు కూడా ఈ పురస్కారం వరించింది.

భారత వైమానిక దళం నుంచి పలువురు అధికారులు వీర చక్రకు ఎంపికయ్యారు. శత్రువుల   గగనతలంలోకి చొచ్చుకు వెళ్లి నిర్దేశిత లక్ష్యాలను  ఛేదించినందుకు ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ, ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్‌ పట్నీ, అలాగే  అర్ధరాత్రి వేళ శత్రు భూభాగంలోకి ప్రవేశించి కోటలాంటి లక్ష్యాలను ధ్వంసం చేసిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, సంక్లిష్టమైన వైమానిక దాడిలో అద్భుతమైన సమన్వయం ప్రదర్శించిన స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్‌లకు  వీర చక్ర పురస్కారాలు ప్రకటించారు.

మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.