పాలిటిక్స్ లోకి సోనూసూద్! పంజాబ్ ఎన్నికల్లో పోటీ..

Publish Date:Nov 14, 2021

Advertisement

సినిమాల్లో విలన్.. కాని నిజ జీవితంలో మాత్రం ఆయన హీరో.. ఇదంతా చెబుతోంది ఎవరి గురించో తెలిసింది కదూ... రీల్ విలన్.. రియల్ హీరోగా జనాల నుంచి నీరాజనాలు అందుకుంటున్న సోనుసూద్ గురించే. కరోనా టైమ్‌లో సోనూ సూద్ చాలా సేవ చేశారు. సాయం అంటే సోనూ సూద్.! సోనూ సూద్ అంటే సాయం అన్న రేంజ్‌లో మార్మోమోగింది.

లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన నిస్సహాయంగా ఉన్న వందలాది మంది వలసదారులను వారి స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్ సమయంలో, అతను కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను సరఫరా చేశారు.ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది.  స్టార్‌హీరోలకు లేని క్రేజ్ ఆయన సొంతమైంది. సెలబ్రెటీలు సైతం సాహో అన్నారు. వెల్‌డన్‌ అంటూ అప్రిషియేట్ చేశారు. 

తన అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజాదరణ పొందిన సోనూ సూద్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోను రాజకీయాల్లోకి రావాలంటూ కొందర డిమాండ్ కూడా చేశారు. కొన్ని పార్టీలు కూడా ఆయనను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.  అయితే తనపై వస్తున్న  రాజకీయ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు సోనుసూద్. తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ, తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. 

ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్‌ రాబోయే పంజాజ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం సోనూసూదా వెల్లడించలేదు.‘‘మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం’’ అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్‌ ప్రకటించారు.

సోనూ సూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్స్‌’ అనే కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు. దీంతో సోనూ సోదరి మాళవిక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఆప్ నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. ఇండిపెండెంట్ గానూ పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా సోనూసూద్ సోదరి పొలిటికల్ ఎంట్రీ రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.