సోనియానే సుప్రీం లీడర్.. అందరి నోటా అదే మాట!

Publish Date:Oct 19, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ( అక్టోబర్ 19) న కౌంటింగ్ జరుగుతుంది. పోటీలో ఉన్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లలో ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు. అయినా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ  మంత్రి  చిదంబరం చెప్పినట్లుగా  అందిరికీ తెలిసిందే అయినా, శంఖంలో పోసే వరకు ఆగితే పోయేదేమీ లేదు.

అయితే  ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది అసలు ప్రశ్నే కాదు. అయితే ఖర్గే కాదంటే (అనే ప్రశ్నే లేదని అంతరాత్మ ఘోషిస్తోంది) థరూర్. ఇద్దరిలో ఎవరు గెలిచినా పెద్దగా ఫరక్ పడదు. కానీ, ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో గాంధీలు కాకుండా వేరొకరు కూర్చోవడం కాంగ్రెస్ నాయకులు చాలా మందికి, ఇదొక అనూహ్య వాస్తవం, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చును.  

అదలా ఉంటే కాంగ్రెస్ వ్యవహారాల్లో ఇకపై గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంకా) పోషించే పాత్ర ఏమిటి? ఇప్పడు చాలా మందిలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాదుల్లో ఉన్న సందేహం ఇది. అయితే  అధ్యక్ష పదవిలో లేనంత మాత్రాన గాంధీలు కాంగ్రెస్ కు దూరమై పోతారనో, పార్టీలో వారి పలుకు బడి పెత్తనం పలచబడి పోతుందనో అనుకుంటే అది పొరపాటే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎవరి దాకానో ఎందుకు, అధ్యక్ష రేసులో ముందున్న మల్లికార్జున ఖర్గేనే ఎన్నికల్లో తాను గెలిస్తే పార్టీని ముందుకు తీసుకుపోయే విషయంలో గాంధీల సూచనలు, సలహాలు తప్పక తీసుకుంటానని స్పష్టం చేశారు.

అంతే కాదు  గాంధీల డైరెక్షన్ లో పనిచేయడం అవమానంగా భావించనని  రిమోట్ కంట్రోల్ అని అవహేళన చేసినా పట్టించుకోనని ఖర్గే తేల్చి చెప్పారు. శశి థరూర్ అంత ఓపెన్ గా ఆ మాట అనక పోయినా గాంధీల నాయకత్వాన్ని కాదనలేమని అయితే అంగీకరించారు. అంతే కాదు గాంధీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు స్వతంత్రంగా పనిచేయడం అయ్యేపని కాదని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత  40 ఏళ్లకు పైగా  కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించిన గాంధీల డిఎన్ఎనే కాంగ్రెస్ రక్తంలో ప్రవహిస్తోందని థరూర్ కాంగ్రెస్ పార్టీ ని గాంధీలను వేరు చేసే చూడలేమని తేల్చి చెప్పారు. 

అధ్యక్ష రేసులో ఉన్న ఆ ఇద్దరే కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికాసోనీ, ముకుల్ వాస్నిక్, చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్  ఇంకా అనేక మంది పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు అందరూ కూడా  అధ్యక్షుడు ఎవరైనా గాంధీల నాయకత్వంలో పనిచేయవలసిందే అనే అభిప్రాయాన్నే వ్యక్త పరిచారు. గాంధీలతో కాంగ్రెస్ ను వేరు చేసేప్రయత్నాలు ఫలించవని అంబిక సోనీ పేర్కొంటే, ముకు వాస్నిక్ సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా  గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ మూల స్థంభంగా నిలుస్తుంది, సోనియా గాంధీ పార్టీ నేతగా కొనసాగుతారని అన్నారు. సోనియా గాంధీ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో కాంగ్రెస్ ముందకు సాగుతుందని వాస్నిక్ స్పష్టం చేశారు.

అలాగే, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తామని, మరో సీనియర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు.  నిజానికి, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవితో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సహా ఇతర  కీలక పదవుల్లో కొనసాగుతారు. అయినా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గాంధీలకు పదవులు ఎందుకు.. పదవులు ఉన్నా లేకున్నా ... కాంగ్రెస్ అంటే గాంధీలు, గాంధీలు అంటే కాంగ్రెస్ ... అంతేగా ...

By
en-us Political News

  
ప్రధాని మూడోసారి ప్రధానిగా అయ్యాక రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు
ఫార్ములా-ఈ కార్‌ కేసులో  ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని  ప్రశ్నించింది
ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చచే పట్టారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అయితే ఆ దీక్ష కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. ఈ సారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
గత వారం  రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై  ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు  టీం ఖండించింది. . ఈ ప్రచారంపై కుట్ర కోణం ఉందని ఆరోపించింది.
తెలుగురాష్ట్రాలను చలి పులి చంపేస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి.
మొదటి వారం చివరి రోజున జెపిసి నివేదికను లోకసభ సమర్పించాల్సి ఉంటుంది.  పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్బంగా సవరణ బిల్లు ను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును  ప్రవేశ పెట్టారు. 
బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.