Publish Date:Apr 19, 2025
ఒక ఐడియా మాత్రమే కాదు.. ఒక పొరపాటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఓటమిపాలైన వైసీపీ నాయకుల్లో ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఫ్యాన్ పార్టీని నమ్ముకున్న చాలామంది నాయకులు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు.
Publish Date:Apr 19, 2025
తిరుపతిలో మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాళహస్తిలో శనివారం ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Publish Date:Apr 19, 2025
అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిరపుంజిలో ప్రకృతి సోయగాలకు మైమరిచిపోయారు.
Publish Date:Apr 19, 2025
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై టీమ్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో అంగరంగ వైభవంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కేట్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Publish Date:Apr 19, 2025
రాష్ట్రంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ఈ ఎలక్షన్‌లో మజ్లిస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వద్దు ఎంఐఎం వద్దని ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు.
Publish Date:Apr 19, 2025
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్ అధికారుల విచారణ ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్‌రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారుల బృందం విచారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి ఆయన్ను పిలిచే అవకాశముంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, మిథున్‌రెడ్డి ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
Publish Date:Apr 19, 2025
అనుకున్నట్టే జరిగింది... విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అయింది. మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకపు బీసీ మహిళ బలయ్యారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఎదురుగా తిరగడంతో ఆ పార్టీ పరువు మరోసారి గంగలో కలిసింది.
Publish Date:Apr 19, 2025
హైదరాబాద్ హఫీజ్ పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీసును పోలీసులు భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది. హఫీజ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం రోజున కూల్చివేతలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ మాట్లాడుతు మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని అన్నారు.
Publish Date:Apr 19, 2025
అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో గాంధీలు జైలుకు వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది.
Publish Date:Apr 19, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 75 పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
Publish Date:Apr 19, 2025
మే 7 నుంచి మే 31 వరకూ హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత అందాలను ప్రదర్శించేలా ఒక ఏర్పాటు చేయనుంది రాష్ట్ర పర్యాటక శాఖ.
Publish Date:Apr 19, 2025
ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాల విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీషు మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు.
Publish Date:Apr 19, 2025
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన విశాఖపట్నం నగరపాలక సంస్థ తెలుగుదేశం కూటమి వశం అయ్యింది. వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదఏశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో గత కొన్ని రోజులుగా విశాఖలో రాజకీయ వేడి పెరిగిన సంగతి తెలిసిందే.