అధిష్టానంతో పెట్టుకుంటే అంతే.. యూపీ సీనియర్ నేతలకు షాక్!

Publish Date:Sep 7, 2020

Advertisement

అధిష్టానంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్ మరో సారి రుచి చూపించింది. యూపీ సీనియర్ కాంగ్రెస్ నేతలను అదును చూసి దెబ్బ కొట్టారు అధినేత్రి. మరో రెండేళ్లలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలైన రాజ్ బబ్బర్, జితిన్ ప్రసాదతో పాటు మరి కొందరికి వీటిలో చోటు దక్కలేదు. క్రియాశీల నేత, పూర్తికాలపు అధ్యక్షుడు కావాలంటూ లేఖ రాసి సంతకాలు పెట్టిన 23 మంది నేతలలో వీరిద్దరు కూడా ఉన్నారు. జితిన్ ప్రసాద యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి. రాజ్ బబ్బర్ నిన్న మొన్నటి వరకు యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఏడు కమిటీల్లో ఏ ఒక్క దానిలో కూడా వీరికి చోటు దక్కపోవటాన్ని బట్టి చూస్తే సోనియా వీరిపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది.
 

హైకమాండ్ నిర్ణయంపై యూపీ కాంగ్రెస్ నేతలు వేరేలా బావిస్తున్నారు. వారు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నందున అదనపు భారం మోపటం ఇష్టం లేకే వారిని కమిటీలకు దూరంగా పెట్టిందని, అంతకు మించి అధిష్టానిని వారిపై ఏ దురుద్దేశం లేదని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు.

 

కాంగ్రెస్ అధిష్ఠానం యూపీ మేనిఫెస్టో కమిటీని కూడా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ దీనికి నాయకత్వం వహిస్తారు. పి.ఎల్. పూనియా, సుప్రియా శ్రీనాతే, అర్ధానా మిశ్రా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ మసూద్ తదితరులు ఖుర్షీద్ టీమ్ లో ఉన్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పటికే పలు ఎన్నికల బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేవలం రెండే రెండు సీట్లు గెలిచింది కాంగ్రెస్. రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చెత్త పర్ఫామెన్స్ అదే. సోనియా గాంధీ రాయ్ బరేలిని నిలుపుకున్నప్పటికీ, బిజెపి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేథిలో ఘోర పరాజయం చవిచూశారు. ఇప్పుడు భవిష్యత్ లోకి చూడటమే ముఖ్యమని భావించి అధిష్టానానికి ఎంతో దగ్గరివాడైన సల్మాన్ ఖుర్ఫీద్ పై పెద్ద బాధ్యతలు పెట్టినట్టు తెలుస్తోంది. అలీగఢ్ లో జన్మించిన ఖుర్షీద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన మవనడు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.