19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. : వైద్య సేవలు అందించాలని కోర్టు ఆదేశం.!

Publish Date:Jul 16, 2026

Advertisement

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్ష  గురువారం (జులై 16) నాటికి 19వ రోజుకు చేరింది.  ఈ నేపథ్యంలో   ఆయన ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు తాజాగా  వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని   వైద్య చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని   ఆదేశించింది.

వివరాలిలా ఉన్నాయి..  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో  భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి   పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని   ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనకారుడి ప్రాణ రక్షణ నిమిత్తం తగిన వైద్య సహాయాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని   స్పష్టం చేసింది.

 59 సంవత్సరాల వయసున్న సోనమ్ వాంగ్‌చుక్..  గత 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే సుమారు 8.5 కిలోల మేర బరువు తగ్గినట్లు పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మరో 48 గంటల పాటు ఇదే విధంగా నిరశన దీక్ష కొనసాగితే ఆయన అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.   ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైన పక్షంలో ద్రవరూపంలో ఉండే పోషక విలువలు, విటమిన్లు, అలాగే ఖనిజాలను శరీరానికి అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ఈ పిటిషన్  విచారణ సమయంలో న్యాయస్థానం.. ఇంత కాలంగా దీక్ష జరుగుతున్నా ప్రభుత్వ వైద్య బృందాలు ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు క్రమబద్ధంగా పరీక్షించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తుషార్ మెహతా స్పందిస్తూ, వాంగ్‌చుక్‌కు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వైద్యులు సైతం ఆయనను పరీక్షిస్తున్నారని   వివరించారు. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు..  ఇకపై కేవలం ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలోనే రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ సాగాలని, పరిస్థితి విషమిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.

మరోవైపు హైకోర్టు ఈ   ఆదేశాలు జారీ చేయడానికి కొన్ని గంటల ముందే సోనమ్ వాంగ్‌చుక్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా తన శరీరం  కొంత బలహీన పడిన మాట నిజమేనని..  అయినప్పటికీ తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని ఆ వీడియోలో  పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి సరైన స్పందన వచ్చేంత వరకు తానే రకమైన పరిస్థితుల్లోనూ ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 

తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ఆయన రాబోయే రోజుల్లో చేపట్టబోయే  నిరసన ప్రణాళికను కూడా వెల్లడించారు. జులై 20న   జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. ఈ మహా ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమం పూర్తయిన తర్వాత, తాము లేవనెత్తుతున్న ప్రజా సమస్యల బాధ్యతను ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులకు అప్పగిస్తామని వాంగ్‌చుక్ వివరించారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఈ అంశాలపై గళం విప్పినప్పుడే ఈ ఉద్యమం సరైన మార్గంలో పయనించి ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వాంగ్‌చుక్ నిరసన వేదిక వద్ద ప్రభుత్వ డాక్టర్లతో కూడిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.   

 Delhi High Court on Sonam Wangchuk, Ladakh Activist Protest Delhi, Sonam Wangchuk Health Condition, Jantar Mantar Protest July 20

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.