ఆ హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా.. కేంద్రాకి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..!

Publish Date:Jul 22, 2026

Advertisement

 

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు తన ప్రతిపాదనలను వివరిస్తూ లేఖ పంపారు.

ఉద్యమంలో పాల్గొన్న యువత, విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన కేసులు, పోలీసు వేధింపులు ఉండవని ప్రభుత్వం అధికారికంగా హామీ ఇస్తే వెంటనే తన దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. అలాగే తమ ఆందోళనలను తాత్కాలికంగా పక్కనపెట్టి ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు రావాలని నిరసనకారులను కూడా కోరతానని ఆయన పేర్కొన్నారు.

ఆసుపత్రికి వచ్చి తన ఆరోగ్యాన్ని పరామర్శించి దీక్ష ఉపసంహరించుకోవాలని కోరిన కేంద్ర మంత్రులకు లేఖలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేపర్ లీక్ కారణంగా ఆవేదనతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశం పరిశీలన, పార్లమెంటులో దీనిపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని ఆయన గుర్తుచేశారు.

తన పోరాటం విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని, ఇప్పటికీ 65 మంది వివిధ పార్టీల ఎంపీలు తనకు లేఖ రాసి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. తాను కూడా జీవించి విద్యార్థుల కోసం మరింత సేవ చేయాలనుకుంటున్నానని, అయితే ఆందోళనలో పాల్గొన్న యువత భవిష్యత్తును పణంగా పెట్టి వెనక్కి తగ్గలేనని స్పష్టం చేశారు.

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, లీకేజీ ఆరోపణలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేయడం, లాఠీఛార్జ్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గత పదేళ్లలో అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర ప్రధాన పక్షాలు పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ ఆందోళనలు తీవ్రతరం చేశాయి.

ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తే ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశముంది.

Sonam Wangchuk Hunger Strike, NEET Paper Leak Controversy, Union Ministers JP Nadda Jitendra Singh, Student Protests NEET UG, Sonam Wangchuk Letter to Central Government

By
en-us Political News

  
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.