నా పరిస్థితి దేశానికి తెలియాలి..సెక్యూరిటీపై సోనమ్ వాంగ్ చుక్ ఆగ్రహం.. ఎందుకంటే?

Publish Date:Jul 25, 2026

Advertisement

సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన నిరశన దీక్ష సమయంలో జరిగిన ఈ సంఘటనలో ఆయన  నన్ను అరెస్ట్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది.  ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆసుపత్రి యాజమాన్యం  స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామంటూ ముక్తాయించింది.  న్యాయపరమైన నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వివరణ ఇచ్చింది.

కాగా వాంగ్ చుక్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఈనెల   21న జరిగింది. ఆ సందర్భంగా  సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి ప్రాంగణంలో  ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.  ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను గుర్గావ్‌లోని మెదాంతా ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి లభించినప్పటికీ, ఆసుపత్రి సిబ్బంది ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారనీ,  దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వాంగ్‌చుక్, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తనను కావాలని వేధిస్తున్నారని విమర్శిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారనీ తెలుస్తోంది. 

తనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వాంగ్ చుక్.. తనను అరెస్టు చేసినా, మరెక్కడికైనా తీసుకెళ్లినా ఫరవాలేదనీ, కానీ తన పరిస్థితి ఏంటో దేశానికి తెలియాలని అన్నారు.  ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన వల్ల తనకు తీవ్ర మానసిక ఒత్తిడి కలుగుతోందని, దీనివల్ల ఏమైనా జరిగితే వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం ఆయన ఆసుపత్రి నేలపైనే పడుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా అక్కడే  ఉన్నారు. 

ఈ వివాదంపై సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి వర్గాలు  కేవలం మీడియా కథనాల ఆధారంగా వాంగ్‌చుక్ వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్ళిపోవాలని భావించారని, కానీ కోర్టు అధికారిక రాతపూర్వక ఉత్తర్వులు తమకు అందే వరకు ఆయనను బయటకు పంపడం చట్టపరంగా కుదరలేదని తెలిపాయి. అదే రోజు సాయంత్రం..  కోర్టు ఆదేశాల ప్రతి చేతికందిన వెంటనే ఆయనను సురక్షితంగా మెదాంతా ఆసుపత్రి వైద్యుల బృందానికి అప్పగించినట్లు సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. 

అయితే.. వాంగ్ చుక్ మాత్రం ఈ నెల 18న తనను సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువచ్చిన క్షణం నుంచీ ఆసుపత్రి వర్గాలు  తనను ఒక ఖైదీలా చూశాయని వాంగ్ చుక్ చెబుతున్నారు.   నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కూడా ఉపయోగించనివ్వలేదనీ,  మానసికంగా తనను కుంగదీసేందుకు ఆసుపత్రి వర్గాలు ప్రయత్నించాయనీ వాంగ్ చుక్ ఆరోపంచారు. ప్రయత్నించారని ఆరోపించారు. 

కాగా ఈ వీడియో బయటకు వచ్చిన క్షణం నుంచీ సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యారంగ పరిరక్షణ కోసం నిరశన దీక్షలో ఉన్న ఒక వ్యక్తిపై  ఆసుపత్రి వర్గాలు మరియు భద్రతా సిబ్బంది దురుసుగా, అమర్యాదగా వ్యవహరించడాన్ని నెటిజనులు  తప్పుపడుతున్నారు. 

 Safdarjung Hospital,  Hunger Strike ,  Delhi High Court , Medanta Hospital

By
en-us Political News

  
జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన భారత కేంద్రమంత్రుల చరిత్ర..!
దేశరాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
2024 సాధారణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారిపోయింది.
ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని...ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పెద్ద ఎత్తున సాగిన నిరసన ఘట్టం ఎట్టకేలకు ఒక సంచలనాత్మక ముగింపునకు వచ్చింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తున్నాయి.
ఉద్యోగాలే లేకుంటే ఏఐ విజయం ఎందుకు.. మైక్రోసాఫ్ట్ బాస్ సంచలన వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పరీక్షా వివాదం విద్యార్థుల ఆందోళనల నడుమ కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.