నిరాహార దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్.!

Publish Date:Jul 24, 2026

Advertisement

నీట్ పేపర్ లీక్ కు నిరసనగా గత 26 రోజులుగా చేస్తున్ననిరాహార దీక్షను సోనమ్ వాంగ్ చుక్   విరమించారు.  పరీక్షల వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన, జవాబుదారీతనం కోరుతూ  సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు లిఖిత పూర్వక హామీలే కారణం.   విద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది. 

గురుగ్రామ్‌ మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా కలిసి కేంద్ర ప్రభుత్వం తరఫున  హామీల పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు రెండు మూడు రోజుల నుంచీ..  కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వాంగ్‌చుక్ బృందం విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది.   మౌఖిక ప్రకటనలు లేదా మాటలకు పరిమితం కాకుండా, స్పష్టమైన లిఖితపూర్వక భరోసా ఇస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ ఆ బృందానికి విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లిఖిత పూర్వకంగా రావడంతో దీక్ష విరమించినట్లు ఆయన తెలిపారు.  

ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటంటే..  నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఘటనతో పాటు దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు, అక్రమాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యల అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్రంగా చర్చిచడం,   పేపర్ లీక్ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు  నష్టపరిహారం అందించడం,  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం, ఉన్న కేసులను ఎత్తివేయడం. ఈ మూడు హామీలతో సోనమ్ వాంగ్చుక్ నిరశన దిక్ష విరమించారు. 

కేంద్ర హామీలకు తోడు.. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరశన దీక్ష విరమించాలని చేసిన విజ్ణప్తులు కూడా తన దీక్ష విరమణకు కారణమని ఆయన తెలిపారు. తన పోరాటానికి  మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు  తెలిపారు. దీక్ష విరమణ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ  ప్రత్యేకంగా స్పందించారు. వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అంతేకాకుండా, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, భవిష్యత్తులో దేశంలో ఎలాంటి పోటీ పరీక్షల్లోనూ ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా   కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మరోసారి దేశానికి భరోసా ఇచ్చారు.

NEET UG 2026 paper leak, Central government assurances, JP Nadda Jitendra Singh Medanta

By
en-us Political News

  
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.