Publish Date:Jul 22, 2026
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థుల హక్కుల కోసం, విద్యా రంగంలో సంస్కరణల కోసం గత 24 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ ను మేందాంత ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జూన్ చివరి వారంలో ఆయన నిరవధిక నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మూడు రోజుల కిందట ఆయనను పోలీసులు బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా ఆయన చికిత్స నిరాకరించి నిరశన కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం (జులై 21) అత్యవసర విచారణ జరిపింది. అనంతరం ఆయన కోరిక మేరకు హర్యానాలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికివెంటనే తరలించాలని ఆదేశించింది.
వాంగ్‌చుక్‌కు నిరంతర, అత్యున్నత స్థాయి వైద్య పర్యవేక్షణ అత్యవసరమని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ వైద్యులతో పాటు ఆయన వ్యక్తిగత వైద్య బృందం కూడా కోర్టుకు తెలిపారు. ఇలా ఉండగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్, నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించే వరకు తన నిరశన విరమించేది లేదని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేశారు. తనను మేదాంత ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అక్కడ కూడా నిరశన కొనసాగిస్తానని పేర్కొన్నారు.
Delhi High Court order, Medanta Hospital Gurugram, Hunger strike 24 days, Sonam wangchuk
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sonam-wangchk-shifted-to-medantha-hospital-36-226704.html
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర , భారతీయ విధానం అనే అంశంపై మోహన్ భగవత్ ప్రసంగిస్తారు.
శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిలుపును జనం ఖాతరు చేయలేదు. పీవోకే రాజధాని ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా మౌజమ్‌పూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రహీస్ అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది.
విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు సాధించడమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారబోదని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రెషర్ గ్రూప్ గా అంటే ఒత్తిడి బృందం గా మాత్రమే విద్యా వ్యవస్థ సంక్షేమం కోసం పని చేస్తుందని విస్ఫష్టంగా ప్రకటించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.