సోము వీర్రాజుకు ఉద్వాసన

Publish Date:Jul 4, 2023

Advertisement

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు పార్టీ హై కమాండ్ ఉద్వాసన పలికింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా వీర్రాజుకు ఫోన్ చేసి తెలియజేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మీ పదవీ కాలం ముగిసిందని  సోము వీర్రాజుకు గుర్తు చేసిన నడ్డా.. ఆయనను తొలగిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పదవికి రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. దీంతో చాలా కాలంగా సోము వీర్రాజు తొలగింపుపై వస్తున్న వార్తలు వాస్తవమయ్యాయి. ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని తొలగించిన బీజేపీ ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తుందన్నది చూడాల్సి ఉంది.  

అసలు చాలా కాలం నుంచీ సోము వీర్రాజు వ్యవహారశైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వ్యవహార శైలి కారణంగానే ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దూరమయ్యారు. మిగిలిన నేతలలో కూడా అత్యధికులు సోము వీర్రాజు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్షులను మారుస్తూ  తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతే కాకుండా మిత్రపక్షమైన  జనసేన పట్ల సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల కూడా పార్టీ లో అసంతృప్తి వ్యక్తమౌతున్నది.  రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు   సన్నిహితంగా మెలగడం ద్వారా  అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది.

పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక   స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే వీర్రాజును తొలగించడం ఖాయమని గత కొంత కాలంగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం సోము వీర్రాజును పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.