సోముది ఆత్మ విశ్వాసం కాదు.. అతి విశ్వాసం !

Publish Date:May 8, 2022

Advertisement

పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వెళ్లి మరీ రాలేనని చెప్పిందటో పెద్ద ముత్తయిదవ. అలా ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు. ఏపీలో బీజేపీ ఉనికే నామమాత్రం. ఆ పార్టీ రాష్ట్రంలో సొంతంగా కనీసం ఒక్క స్థానంలోనైనా గెలిచే పాటి బలం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల మాత్రమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులకు మాట్లాడేందుకు ఆ మాత్రమైనా అవకాశం వస్తున్నది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా కాంగ్రెస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్లు దాదాపు శూన్యమనే చెప్పవచ్చు. 2009 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఆ స్థానాలు కూడా తెలుగుదేశంతో పొత్తు కారణంగానే తప్ప సొంత బలం ఇసుమంతైనా కాదు. 2014 ఎన్నికలలో ఆ పార్టీ తరఫున నిలబడిన వారెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014కు ఇప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదనడంలో సందేహం లేదు.

అయితే రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా తమ మద్దతు లేకుంటే సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. సోము వీర్రాజైతే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ తమ పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించి సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ కు గురయ్యారు. 
ఇంతకీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పై పోరాటాలకు అందరూ కలిసి రావాలనీ, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని.. దీనిని సోము వీర్రాజు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ..పొత్తుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేడపతామని కూడా ఘనంగా ప్రకటించేశారు.

ఆయన మాటలు రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు.  రాజకీయ నాయకులలో ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ.. సోము వీర్రాజుకు ఉన్నది ఆత్మ విశ్వాసం కాదనీ అతి విశ్వాసమనీ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం అధినేత పొత్తు గురించి, కలిసిరావాలంటూ చేసిన ప్రతిపాదన జన సేన పార్టీని ఉద్దేశించి అన్నది అందరికీ తెలిసిందే. ఒక వేళ జనసేన టీడీపీల మధ్య పొత్తు కలిసినా బీజేపీని కలుపుకుంటారా లేదా అన్నది డౌటే..  బీజేపీకి రాష్ట్రంలో ఉన్న పరపతి, పట్టు బలం ఆధారంగా చూస్తే పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే మూడు నాలుగు స్థానాలను కోల్పోవడం తప్ప  మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.