సోముకు ఉద్వాసనతో జీవీఎల్ ఆశలు గల్లంతు.. లింకేంటి?

Publish Date:Jul 7, 2023

Advertisement

 ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాయకత్వాల మార్పుతో సమీకరణలు మారుతున్నాయి. సోము వీర్రాజు స్థానంలో అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే.  సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా ఆ పార్టీ నియామకంతో  ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ ఆశలు అడియాశలు అయ్యాయని కమలం శ్రేణులలో చర్చ మొదలైంది.

అదేంటి సోము వీర్రాజు ఉద్వాసనకూ, పురందేశ్వరి నియామకానికీ సోము వీర్రాజుకూ సంబంధం ఏమిటనుకుంటున్నారు. జీవీఎస్ బీజేపీ రాజ్యసభ సభ్యుడే అయినా ఆయన కు ఆ సభ్యత్వం ఏపీ నుంచి కాదు వేరే రాష్ట్రం నుంచి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయన విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయన రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.  సోము వీర్రాజుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు లభించడం వెనుక సోము వీర్రాజు ఉన్నారని కూడా పార్టీ శ్రేణులు చెబుతుంటారు.  వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని  నిర్ణయించుకున్న జీవీఎల్ డిసైడయ్యారు. అందుకే అక్కడే ఇళ్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు.

ఇక పురంధేశ్వరికి రాష్ట్ర బీజేపీ పగ్గాలను హై కమాండ్ అప్పగించడంతో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్న జీవీఎల్ ఆశలు గల్లంతైనట్లేనని అంటున్నారు. ఎందుకంటే పురంధేశ్వరి విశాఖ నుంచి 2009లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ స్థానం మారిన తరువాత ఆమె వరుసగా రెండు సార్లు పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న ఆమె తనకు అచ్చి వచ్చిన విశాఖ నుంచి పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయిపోయినట్లే భావించవచ్చు. 

 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014లో పొత్తులో భాగంగా విశాఖ నుంచి బరిలో దిగాలని చూసినా హరిబాబు ఉండడంతో సాధ్యం కాలేదు. రాజంపేట నుంచి పోటీకి దిగినా నెగ్గలేదు. ఆ తరువాత 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసినా పరాజయం పాలయ్యారు. దీంతో ఆమె  2024లో  విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో 2014 నాటి పొత్తులు మళ్లీ పొడుస్తాయని భావిస్తున్న తరుణంలో గెలుపు నల్లేరు మీద బండినడకేనని అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ పురంధేశ్వరికి విశాఖ  బీజేపీ టికెట్ కు మధ్య జీవీఎల్ నరసిహరావు ఉన్నారు.

ఎప్పుడైతే బీజేపీ పగ్గాలు సోము వీర్రాజు చేతుల నుంచి పురంధేశ్వరికి వచ్చాయో.. ఇక పార్టీ హై కమాండ్ సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకునే అవకాశం ఉండదని అంటున్నారు. సోము వీర్రాజు వ్యవహారశైలిని గట్టిగా వ్యతిరేకించిన ఏపీ బీజేపీ నేతలలో పురంధేశ్వరి కూడా ఉన్నారు.  జగన్ సర్కార్ తో రాష్ట్ర బీజేపీ అంటకాగుతున్నదన్న భావన జనబాహుల్యంలో కలిగేలా సోము వీర్రాజు వ్యవహరిస్తుంటే ఆయనకు  జీవీఎల్ వంతపాడుతున్నారని కూడా పురందేశ్వరి విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రపగ్గాలు సోము వీర్రాజు నుంచి పురందేశ్వరికి బదలీ అయ్యాయి.

రాష్ట్ర బీజేపీ ప్రొ వైసీపీ అన్న ఇమేజ్ నుంచి బయటపడేందుకు ఈ మార్పు దోహదపడుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజుకు వంత పాడుతూ వచ్చిన జీవీఎల్ రెక్కలు కూడా అధిష్ఠానం కత్తిరించినట్లేనని పరిశీలకులు అంటున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా అధిష్ఠానం సోము విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసిన తరువాత జీవీఎల్ వైసీపీపై విమర్శల దాడి పెంచి జనసేన, తెలుగుదేశం పార్టీలను పన్నెత్తు మాట అనడం మానేశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది.   

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.