సోమేష్ కుమార్ రిలీవ్ డ్.. నెక్ట్స్ సీఎస్ ఎవరంటే..?

Publish Date:Jan 11, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఇవి తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సోమేష్ కుమార్ ఈ నెల 12 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని కూడా డీవోపీటీ స్పష్టం చేసింది.

అంటే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న సోమేష్ కుమార్ ముందు ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది.దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించడంతో గతంలో ఆయన తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.  అప్పటి నుంచీ ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017 లోనే కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగించటాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదం కొలిక్కి వచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు కొట్టేయటం విశేషం. అయితే ..3 వారాలు సమయం కావాలని సోమేశ్ కుమార్ అభ్యర్థనను కూడా   తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయింనున్నట్లు చెబుతున్నారు.

అయితే ఆయన సుప్రీంను ఆశ్రయించినా ఆశ్రయించకున్నా కోర్టు తీర్పు మేరకు ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి ఈ నెల 12 లోగా.. అంటే మంగళవారం (జనవరి 10) కోర్టు తీర్పు ఇస్తే.. గురువారం (జనవరి 12)లోగా ఏపీ సర్కార్ కు రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లడమా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఏపీకి వెళ్లకుండా స్వచ్ఛంద విరమణ తీసుకుంటే ఆయనకు రాష్ట్రంలో రెండు ఆప్షన్స్ ఉంటాయని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి దక్కే అవకాశం ఉంది. లేదంటే గతంలో కేవీ రమణాచారి చేసిన విధంగా రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందంటున్నారు. బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు.

ఇక సోమేష్ కుమార్ విషయం అలా ఉంచితే ఆయన రిలీవ్ అయిపోవడంతో.. తెలంగాణ సీఎస్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగువన్ ఇంతకు ముందే చెప్పినట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో తెలంగాణలో పలువురు ఉన్నప్పటికీ  పోటీ మాత్రం ప్రధానంగా ముగ్గురి మధ్యే ఉంటుంది. వారిలో మరీ ముఖ్యంగా ప్రణాళికా సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖల స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్ లు రేసులో ముందున్నారన సచివాలయ వర్గాలలో వినిపిస్తోంది.

సోమేష్ కుమార్ ను రిలీవ్ చేసిన నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్నది కేసీఆర్ సర్కార్ ఇహనో ఇప్పుడో   ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగుతోంది.  అయితే వీరిలో మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్న అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని చెబుతున్నారు.

 కాగా రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌లో బీహార్‌కు చెందిన అధికారులే ఉన్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన  అరవింద్ కుమార్ కే కేసీఆర్ అవకాశం ఇస్తారని అంటున్నారు.  అయితే విపక్షాలు బయటి వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో రామకృష్ణకు సీఎస్ పదవి కట్టబెట్టే విషయం ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే మునిసిపల్ వ్యవహారాల శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ కేసీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉండటం, అలాగే స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికే కీలక పదవులు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి మెగ్గు చూపుతుండటంతో అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ కూడా బీహార్ కు చెందిన వారే కావడం గమనార్హం. 
 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.