బంధాలు బాగుండాలంటే భాగస్వామి దగ్గర ఈ విషయాలు దాచిపెట్టడం తప్పు కాదట..!

Publish Date:Feb 10, 2026

Advertisement

ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం,  కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా,  బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు.  బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే..

మాజీ ప్రేమికుల గురించి..

 భాగస్వామికి  గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా  మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో  గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల  ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది.  అందుకే  ఒక కొత్త బంధం మొదలుపెట్టాక   గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది.  దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది.

సొంత వ్యక్తుల చెడుగుణం..

 భాగస్వామి స్నేహితుల్లో  లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా  మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ  బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా  ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు  పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది.  సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఇతరుల రహస్యాలు..

 ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే..   మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత  ఉంటుంది. కాబట్టి  స్నేహితుల గోప్యతను గౌరవించాలి.   వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు.

ఇష్టాలు, అయిష్టాలు..

భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే  నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు  అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే..   ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి,  చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు.

సోషల్ మీడియా పాస్వర్డ్ లు..

నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరం.  ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు.

సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.

                               *రూపశ్రీ

By
en-us Political News

  
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.