వేతన వెతలు.. రివర్స్ పీఆర్సీ.. జగనన్న వృద్ధులనూ వదల్లేదుగా..!

Publish Date:Jan 22, 2022

Advertisement

ఎవరికన్నాఆసక్తి ఉంటే ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ప్రసంగ వీడియోలను చూడండి... ఈ ప్రసంగాలలో జగన్మోహన్ రెడ్డి, చేతులు, చూపులు విభిన్న భంగిమల్లో తిప్పుతూ, బహుముఖ విన్యాసాలు చేస్తూ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ అంటూ మొదలు పెట్టి ప్రతి తాతకు, ప్రతి అవ్వకు అందరికీ అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అందరితో పాటు అవ్వలు,తాతలను కూడా వదలలేదు. అందరితో పాటు   పింఛనుదార్లను కూడా వదల కుండా వారికీ పీఅర్సీ వాతలు పెట్టారు. అందుకే,  వృద్దల గొంతులు కోశారు, అనే ఆవేదన పింఛనుదార్లు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, జగన్ రెడ్డి దేవుని పేరిట ఆడిన అబద్ధాలను నమ్మి, ఓటేసిన పాపానికి, ‘దేవుడు’ తమకు తగిన శిక్షే వేశారని, తాతలు, అవ్వలు వాపోతున్నారు. 

వివరాలలోకి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం అర్థ రాత్రి విడుదల చేసిన కొత్త వేతన సవరణ ఉత్తర్వులతో  ఉద్యోగుల నడ్డి విరిచింది. అలాగే,  ఉద్యోగులతో పాటుగా పింఛనుదారులను దారుణంగా దెబ్బ తీసింది. వృద్ధాప్యంతో నానా అవస్థలు పడుతున్న పింఛనుదారుల పించనుకూ కోతలు విధించింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధ పింఛనుదార్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు విధించింది. 

అదే విధంగా వయసుతో పని లేకుండా, ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో పింఛనుదారులు తమకు వాస్తవంగా రావలసిన మొత్తం కంటే, ఇప్పటికే అధికంగా తీసుకున్నారని, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే కరవు భత్యం (డీఆర్) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది.ఇలా వడ్డించిన విస్తరిలోంచి నోటి కాడి కూడును ఎగరేసుకు పోవడం ఏమిటని, వృద్ధ పించారుదారులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.ఈ పాపం ఉరికే పోదని శపిస్తున్నారు.

ఇతవరకు ఎప్పుడూ కూడా ఇలా, ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం లేదని అంటున్నారు. ఇలా, ఇచ్చిది తీసుకునే కొత్త విధానం  కారణంగా కొందరు పింఛనుదారులు లక్ష రూపాయల  వరకు కూడా  నష్టపోతున్నారని, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్‌ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే సామెతను గుర్తు చేసే విధంగా, పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే అంత్యక్రియల ఖర్చులకు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు పెట్టింది. ఇంతవరకు పింఛనుదారులు చనిపోతే, అత్యక్రియల ఖర్చుల కోసంగా ప్రభుత్వం,కనీస మొత్తం రూ.15 వేలకు తగ్గకుండా  ఒక నెల పింఛను ఇస్తోంది. అయితే ఇప్పుడు, నెల పింఛను ఎంతున్నా, కనిష్టంగా రూ 15లు గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని కొత్త  ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే నెల పింఛను రూ. 20, రూ.50 వేలు అంతకు ఎక్కువ ఉన్నా, అంత్యక్రియలకు ఇచ్చేది మాత్రం ఆ రూ. 20 వేలు మాత్రమే. జగన్ రెడ్డి  ప్రభుత్వం ఇంతలా ఎందుకు కక్కుర్తి పడుతోంది ..ఎందుకు  తాతలు, అవ్వలను సైతం క్షోభకు గురి చేస్తోంది? అంటే వినాశకాలే విపరీత బుద్ధి .. అనే సమాధానమే వస్తోంది.

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.