సంఘీభావ యాత్రలను సహించరా ? 

Publish Date:Oct 17, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాంగం అమలవుతోందా? అక్రమ కేసులో మాజీముఖ్యమంత్రిని జైలు పాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండ్ గా కొత్తగా  వచ్చిన డిఐజీ రవికిరణ్ టిడిపి శ్రేణులపై ఉక్కుపాదం మోపారు. డెమాక్రటిక్ పద్దతితో చంద్రబాబు అర్ధాంగి రాజమండ్రి జైలు వద్ద  ఇవ్వాల్టి నుంచి చేపట్టిన రెండు రోజుల సంఘీభావ కార్యక్రమాన్నిఅడ్డుకుని మరిన్ని విమర్శలను మూటగట్టుకున్నారు. 
రాజమండ్రి జైలులో ఉన్న అరకొరసౌకర్యాలతో చంద్రబాబు ఆరోగ్యం రోజు రోజుకి దిగజారుతోంది. అలెర్జీ, డీ హైడ్రేషన్, ఐదు కిలోల బరువు తగ్గడం ఆయన కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన  జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ అయిన నాటి నుంచి కనీసం హెల్త్ బులిటిన్స్ సక్రమంగా ఇవ్వకపోవడం శోచనీయం. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించే బాధ్యత కూడా వైఎస్ ఆర్ ప్రభుత్వంపై ఉంది.

ప్రజా స్వామ్యంలో నిరసనలు వ్యక్తం చేయడం రాజ్యాంగంలోనే ఉంది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తుంది. అక్రమ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరికి సంఘీభావంగా రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి పోలీసులు అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇటీవలే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, టిడిపి శ్రేణులు చలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు పిలుపులో భాగంగా నిర్వహించే ధర్నాలు, రాస్తారోకోలకు ఎటువంటి అనుమతులు లేవని తూ. గో జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపిన సంగతి తెలిసిందే . పోలీసు నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో డీఐజీ రవికిరణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పుపై టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే ఇప్పుడు రాజమండ్రి జైలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. జైలులో చంద్రబాబుకు సరైన భద్రత లేదని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రావుల్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సమీప బంధువైన ఏపీ జైళ్లశాఖ కోస్తాంధ్ర రీజియన్‌ డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్‌... రాజమండ్రి జైలు ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో టీడీపీ క్యాడెర్ మరింత ఆందోళన నెలకొంది. రవికిరణ్ ఎంట్రీతోనే చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరికి అనుమతి నిరాకరించారు. దీనిపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. తాజాగా నారా భువనేశ్వరి రెండు రోజుల పాటు చేపట్టే కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం అవుతుంది. కానీ ఎపి పోలీసులు అనధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 
 ఏసీబీ కోర్టు వద్ద ఐదురకాల పోలీస్ ఫోర్సులను ఏర్పాటు చేసింది ఎపి ప్రభుత్వం. ర్యాలీలు, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే  చంద్రబాబు లాయర్లు రెండు పిటిషన్లు వేశారు. గృహ నిర్బంధానికి  అనుమతి కోరుతూ ఓ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక సౌకర్యాలు ఉన్న గది కేటాయించాలని మరో పిటిషన్ వేశారు. అయితే చంద్రబాబు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు పోలీసులు రాజమండ్రి జైలు పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ  విధించారు.  చంద్రబాబును స్కిల్ స్కాంలో మరింతగా ప్రశ్నించాలని సీఐడీ భావిస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును వేధింపులకు గురి చేస్తోంది.
చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166,167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది.
టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే  తప్పేముందని  నారా భువనేశ్వరి ప్రశ్నించారు.తనకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేస్తే తప్పా అని ఆమె ప్రశ్నించారు.పార్టీ కార్యకర్తలు  తమ బిడ్డల్లాంటి వారని  భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకొంటామని  నోటీసులు ఇస్తారా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు.తనను కలవకూడదని  చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదన్నారు.

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.