బాబుకు సర్వత్రా సంఘీభావం- ప్రజలను కదిలించిన లోకేష్ బహిరంగ లేఖ

Publish Date:Sep 11, 2023

Advertisement

స్కిల్ డెవలప్ మెంట్ కేసు మెరిట్ లు డీమెరిట్ తో సంబంధం లేదు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన తీరుకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు మద్దతు లభిస్తోంది. తమ కూటమిలో లేకపోయినా విపక్షాల ఐక్య కూటమి ఇండియా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించింది. ఏపీలో జగన్ అరాచక పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమనీ, జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నదని ఇండియా పేర్కొంది. ఏపీలో జగన్, కేంద్రంలో మోడీ ఇద్దరూ కూడా నియంతృత్వ పోకడలకు పోతున్నారనీ, ప్రజాస్వామ్యాన్ని దేశ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేస్తున్నారనీ ఇండియా పేర్కొంది. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకూ దేశం పేరు భారత్ అని మార్చడాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు అరెస్టు తీరును తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపైకి రావడం, నడి రోడ్డుపై పడుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని  కనీసం బయటకు రానీయడం లేదన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా లోకేష్ కు స్వయంగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పడం తో పాటు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని లోకేష్ కు పవన్ చెప్పారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అరెస్టు చేసిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్న విపక్ష నేతను అక్రమంగా అరెస్టు చేయడం అన్నది జగన్ కు రివాజుగా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

రాష్ట్రం నలుమూలల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, విపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని జైలుగా మార్చేసిన నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..

బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన గుండెతో ఈరోజు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ - తెలుగుప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్నీ - ఆత్మనూ ధారపోస్తూ ఉండటం కనులారా చూస్తూ నేను పెరిగాను. లక్షలాది తెలుగుప్రజల జీవితాలను అభివృద్దికరంగా మార్చడానికే అవిశ్రాంతంగా శ్రమిస్తూ ప్రయత్నిస్తున్న ఆయనకి విశ్రాంతి అనే ఒక రోజే తెలియదు. తన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం - నిజాయితీతో కొనసాగటం అందరికీ తెలిసిందే! తను సేవ చేసిన వారి ప్రేమ - కృతజ్ఞతల నుండి ఆయన మరింత లోతైన ప్రేరణను పొందుతూ మరింతగా సేవల్లో మునిగిపోవటమే నేను నిరంతరం చూశాను. ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలు చాలు వారికి.. స్వచ్ఛమైన ఆనందంతో వారి హృదయం ఆయన్ని నిరంతరం ఆనందసాగరంలో ఉంచేది, ఇది ఒక చిన్న బాలుడు పొందే ఆనందంతో సమానం.

నేను కూడా ఆయన నడిచే గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాను - తన అడుగుజాడలనే అనుసరించాను. అమెరికాలో ఎంతో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు - అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం, గౌరవాలపై ఎంతో విశ్వాసం ఉంది.

ఐనప్పటికీ, ఈ రోజు, మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది - నా రక్తం ఉడికిపోతుంది. 'రాజకీయపగ' అనే సముద్రం ఆయనను ముంచేసే లోతులకు హద్దులే లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇన్నిన్ని ఘనకార్యాలు చేసిన నాన్నగారి స్థాయి వ్యక్తి.. ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఎందుకంటే?! తను ఎప్పుడూ పగ రాజకీయాలకు లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు.. తను ఇతరుల కంటే చాలా ముందే మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం  - అవకాశాలను ఊహించి, ఆ దిశగా కృషి చేసినందుకా?

ఇదంతా చూస్తుంటే ఈరోజు ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు. నేనూ అలాగే స్ఫూర్తి పొందాను. ఆంధ్రప్రదేశ్ - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ ఈ అన్యాయం నుంచి బైటపడి తిరుగులేని శక్తిగా తిరిగి ఎదుగుతాం. ఈ యుద్ధంలో ప్రజలే అంతిమంగా గెలవాలి! అందుకోసం నాతో మీరంతా కలిసి రావాలనీ మనందరికోసం నేను మిమ్మల్ని కోరుతున్నాను. - మీ లోకేష్

నారా లోకేష్ రాసిన ఈ ఉద్వేగ పూరిత ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు స్వచ్ఛందంగా లోకేష్ కు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాగ్రహ జ్వాల వచ్చే ఎన్నికలలో జగన్ అధికారాన్ని దహించి వేయడం ఖాయమని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రాసిన ఈ లేఖను నెటిజన్లు రీట్వీట్ చేయడమే కాక భారీగా షేర్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.