తిరుమలలో తాచుపాము హల్ చల్.. కొత్త సంవత్సరంలో కంగారుపెట్టిన సర్పం
Publish Date:Jan 1, 2025
Advertisement
కొత్త సంవత్సరానికి తిరుమలలో ఓ నాగుపాము స్వాగతం చెప్పింది. బుసలు కొడుతూ ఊగిపోతున్న ఆ తాచుపామును చూసి భక్తులు భయకంపితులయ్యారు. బుధవారం (జనవరి 1) ఉదయం తిరుమల రాంబగిచా గెస్ట్ హౌస్ దగ్గర ఓ తాచుపాము హల్ చల్ చేసింది. దాదాపు ఆరు అడుగులు ఉన్న ఈ పాము బుసలు కొడుతూ ఊగిపోతుండటంతో భక్తులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతడు వెంటనే రంగంలోకి దిగి అతి కష్టం మీద ఆ తాచుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం జనంలో సందడిగా ఉండే రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్ద నాగుపాము హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/snake-halchal-in-tirumala-25-190627.html
http://www.teluguone.com/news/content/snake-halchal-in-tirumala-25-190627.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





