రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో జూన్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ అన్ని పార్టీల నేతలు స్వయంగా ఇతర పార్టీలపై నేరుగా బురదజల్లే ప్రయత్నాలు చేశారు. అదీ ప్రచార సమయంలో మాత్రమే. కానీ, కొందరు తెలివైన వ్యక్తులు ఈ ఎస్ ఎంఎస్ లను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు.ఇలా ప్రచారంలో ఓట్లు అభ్యర్థించటంతో సరిపెట్టకుండా ప్రత్యర్థుల పై ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఫలానా అభ్యర్థికి మీరు ఓటు వేస్తే నియోజకవర్గానికి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత ఆరోపణలకు టెక్నాలజీని వినియోగించే వారందరిపైనా చర్య తీసుకోవాలని ఇసి నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఇటీవల గుంటూరులో వెలుగులోకి వచ్చిన ఈ నెగిటీవ్ ప్రచార ఎస్ ఎంఎస్ లపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరింది. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఈ ఎస్ ఎంఎస్ లపై మండిపడి పోలీసులు ఎలాగైనా ఈ కేసును చేధించాలని ఆదేశించారు. కోడ్ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించొద్దని పోలీసులకు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా ఎస్పీ కూడా స్పందించి ఎవరికైనా ఇటువంటి ఎస్ ఎంఎస్ లు వస్తే తనకు తెలియజేయాలని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sms-by-poll-campaigns-24-14681.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.