బాబు, కిరణ్ కు సవాల్ గా మారిన తిరుపతి ఎన్నికలు

Publish Date:Jun 7, 2012

Advertisement

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారే. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని వీరిద్దరూ పట్టుదలగా ఉన్నారు. స్ పట్టున్న ప్రాంతాల్లో వీరు ఎక్కువగా తిరుగుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతి పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తితో సహా పలువురు నేతలు ప్రచారం చేసేశారు. కొన్ని సంఘాల పేరిట ముద్రించిన కరపత్రాలను తమ ప్రచారంలో భాగంగా పంచిపెట్టారు. వీరి ప్రచారశైలిని గమనించిన తన తరుపున ప్రచారం చేసేవారికి ఒక గ్రూపుగానూ, తాను ఒక గ్రూపుగానూ చీలిపోయి ప్రచారం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వెంకటరమణ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రచారం చేసిన 15 నిమిషాల తరువాత కాంగ్రెస్ ప్రచారం అదే ప్రాంతంలో జరిగేలా ఆయన ఏర్పాటు చేశారు. అంటే టిడిపిపై ఒక గ్రూపు కన్నేసి అనుసరించేలా వెంకటరమణ ఏర్పాట్లు చేయటం నేతలనూ ఇంకేమీ చేయొచ్చో అన్న ఆలోచనలకు పురిగొల్పింది. దీంతో సిఎం ఢిల్లీ నుంచి ఏ నేత వచ్చినా వదలకుండా ముందు తిరుపతి తీసుకువచ్చేస్తున్నారు. వాయలార్ రవి తరువాత గులాంనబీఆజాద్ కూడా రాగానే మొదట ఈ నియోజకవర్గం నుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రముఖ నేతలతో పాటు తిరుగుతూనే వెంకటరమణ తనకు సహాయం చేస్తామన్న నేతలనూ మధ్యమధ్యలో పలకరిస్తున్నారు. ఇటు ఓటు అభ్యర్థిస్తూనే అటు సెల్ లో వారి సహకారం ఏ రూపంలో అందుతోందో కనుగొంటున్నారు. మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి రఘువీరారెడ్డిలతో పాటు ఇప్పటిదాకా అలిగిన గల్లా అరుణకుమారి తదితరులను కలుపుకోవటంలో వెంకటరమణ విజయం సాధించారు.

 

 

 

ఐక్యతతో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తరువాత వ్యూహం ఎవరకీ అర్థం కాకుండా సిఎం తీసుకున్న జాగ్రత్తలను అనుసరిస్తూనే అభ్యర్థి వెంకటరమణ ఇతర పార్టీల వ్యూహాలను కిరణ్ కు తెలియజేస్తున్నారు. తాజా సమాచారాలు అందటంతో సిఎం కూడా ఎప్పటికప్పుడు తాము చేసే కార్యక్రమాలను ఎలా మార్చుకోవాలో  వెంకటరమణకు సూచనలు ఇస్తున్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ శంకరరెడ్డి ఓటుబ్యాంకుపై, టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఓటుబ్యాంకు పై దృష్టి సారించిన సిఎం తన సోదరుడి ద్వారా వీరిద్దరి కార్యక్రమాలను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కడప ఎన్నికల ప్రచారానికి వెళ్లాలనుకున్నప్పుడల్లా టిడిపి అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో ఆగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్  ఉత్సాహాన్ని ఎలా దెబ్బతీయాలో తమ కార్యకర్తలకు సూచిస్తూనే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జా గోపాలకృష్ణలు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు బాబు నిర్దేశిస్తున్నారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్ తదితరులు చేసిన ప్రచారం వల్ల ఉండే ప్రయోజనాలను సమీక్షిస్తూనే అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని కొత్తతరహాలో ఆలోచనలు చేయమని బాబు ప్రోత్సహిస్తున్నారట. ఇలా వ్యూహప్రతివ్యూహల్లో ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ లో ఐక్యతను చెదరగొట్టేందుకు తెలుగుదేశం వేసిన ఎత్తుగడలు ఇప్పటిదాకా ఫలించలేదు. కానీ, బాబు రాజకీయ అనుభవంతో చేసే ప్రతీ పని ఫలితమిస్తుందని, ఎన్నికలు దగ్గరయ్యేటప్పటికి వాతావరణం తమకు అనుకూలమవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

By
en-us Political News

  
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.