స్మితా సభర్వాల్‌కి ఏమైంది?

Publish Date:Jul 21, 2024

Advertisement

కేసీఆర్ గవర్నమెంట్ వున్నప్పుడు అర్హతకు మించిన అందలాలు అందుకుని,  సీఎం కార్యాలయంలో హవా నడిపించిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కి ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేదు. గతంలో మాదిరిగా ఆహా, ఓహో అంటూ భజన చేసేవారు లేరు. అందుకేమో ఉనికిని ప్రకటించుకోవడానికి అన్నట్టుగా స్మితా సభర్వాల్ మానసిక పరిస్థితి అదుపు తప్పిందన్నట్టుగా ‘ఎక్స్’ వేదికగా కామెంట్లు పోస్టు చేశారు. సివిల్ సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని, వాటిని రద్దు చేయాలని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈమధ్య పూజా ఖేడ్కర్ అనే ఐఏఎస్ వివాదాస్పదంగా మారింది. ఆమె తప్పుడు దివ్యాంగ ధ్రువీకరణ పత్రంతో ఐఏఎస్ అయిందనే వాదన వినిపిస్తోంది. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. దీని మీద కమిషన్ సభ్యుడు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సభర్వాల్ అసలు మొత్తానికే దివ్యాంగులకు రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనాన్ని సృష్టించింది. 

అదేవిధంగా యూపీఎస్సీకి ఛైర్మన్‌గా వున్న మనోజ్ సోనీ తనకు ఇంకా ఐదేళ్ళ సర్వీసు వుండగానే రాజీనామా చేశారు. ఈయన రాజీనామాకు, రెండేళ్ళ క్రితం తప్పుడు దివ్యాంగ సర్టిఫికెట్‌తో ఐఏఎస్ అయిన పూజా ఖేడ్కర్ అంశానికీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే, మనోజ్ సోనీ ఆరు నెలల క్రితమే యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల ఆయన రాజీనామాకి, పూజా ఖేడ్కర్ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ స్మితా సభర్వాల్ మనోజ్ సోనీ మీద కూడా కామెంట్లు పోస్టు చేశారు. మనోజ్ సోనీ రాజీనామా చేసి తప్పించుకుపోలేరని ఆమె కామెంట్ చేశారు. మనోజ్ సోనీ రాజీనామా చేయడం తప్పించుకు పోయినట్టు ఎందుకు అవుతుంది? పూజా ఖేడ్కర్ ఇష్యూతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సభర్వాల్‌కి ఇంత చిన్న విషయం కూడా తెలియనట్టుగా మనోజ్ సోనీ మీద కామెంట్లు పెట్టారు.

దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది స్మితా సభర్వాల్ కాదు.. తనకు సంబంధించని విషయం మీద, చాలా సున్నితమైన విషయం మీద అనవసరపు కామెంట్లు చేయడం ద్వారా స్మితా సభర్వాల్ కొత్త వివాదానికి తెరతీశారు. స్మిత చేసిన కామెంట్ల మీద భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్మిత సభర్వాల్‌ మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.