వారెవ్వా ఏమి ట్యాబ్లెట్
Publish Date:Jan 7, 2015
Advertisement
ట్యాబ్లెట్ ఎంత తేలిగ్గా వుంటే దాన్ని ఉపయోగించే వాళ్ళకి అంత సౌకర్యంగా వుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అనేక కంపెనీలు తాము ఉత్పత్తి చేసే ట్యాబ్లెట్ల బరువును క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ముందుండే డెల్ సంస్థ తాజాగా అత్యంత పల్చగా వుండే ట్యాబ్లెట్‌ని తయారు చేసింది. వెన్యూ 8 పేరుతో రూపొందించిన ఈ టాబ్లెట్ ఈమధ్యే మార్కెట్లోకి కూడా విడుదలైంది. ప్రస్తుతం అమెరికాలో దొరుకుతోంది. తెలిసినవారి చేత తెప్పించుకోవాలంటే దాదాపు పాతికవేల రూపాయల ధరకు లభిస్తుంది. ఇంటెల్ సహకారంతో నిర్మించిన ఈ గాడ్జెట్‌లో ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డెస్క్‌టాప్ పీసీ సామర్థ్యానికి సమీపంలో ఇది ఉంటుంది. దీంతోపాటు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, రెండు గిగాబైట్ల ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువు అవుతుంది. గ్రాఫిక్స్ మోతాదు ఎక్కువగా ఉండే గేమ్స్‌ను ఈ ట్యాబ్లెట్లో హాయిగా అడుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఎనిమిది మెగాపిక్సెళ్ల కెమెరా నిక్షిప్తమై వుంది. డెల్ వెన్యూ 8లో 16 జీబీల బిల్ట్ ఇన్ స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్‌డీకార్డు ద్వారా దీన్ని మనకు కావలసినంత స్థాయికి పెంచుకోవచ్చు కూడా. స్క్రీన్‌సైజు 8.4 అంగుళాలు కాగా, రెజల్యూషన్ 2560 / 1480 వరకూ ఉంటుంది. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు. ఇంకేం.. అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా.. వెంటనే తెప్పించుకోండి.. ఇండియాకి ఇది ఎప్పటికి వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదుమరి.
http://www.teluguone.com/news/content/slim-tablet-33-41856.html
మైక్రోమాక్స్ మొబైల్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన యు టెలివెంచర్స్ తన సరికొత్త రెండో స్మార్ట్ ఫోన్ యుఫొరియా మోడల్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది.
'గూగుల్ హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్' అంటే చేత్తే రాస్తే టెక్ట్స్ గా మార్చే సరికొత్త యాప్ విడుదలైంది. దాదాపు 82 భాషలను ఈ యాప్ సాధారణ టెక్ట్స్ గా మారుస్తుంది.
ఏదో ఒక సందర్భంలో మనం ఫోన్ మర్చిపోతుంటాం. తెలిసిన తరువాత గాబరా పడిపోతాం. ఇప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కనిపించకుండా పోయిన ఫోన్ వెతికేందుకు గూగుల్ కొత్తగా ఓ ఫీచర్ ను రూపొందించింది.
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎంత మాత్రం స్మార్ట్ ఫోన్లు అయినా అవి కూడా అప్పుడప్పుడు సతాయిస్తుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు అందరికీ కామనే. అయితే వాటిలో కొన్ని మనం సులభంగా పరిష్కరించుకోవచ్చు.
మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ మరో రెండు కొత్త మొబైల్ మోడల్స్ లూమియా 640, లూమియా 640 xL లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. లూమియా 640 ధర రూ. 11,999 లూమియా 640 xL ధర 15,799 గా ఉన్నాయి. రెండు మోడల్స్ ఎల్టీఈ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
కంప్యూటర్ దిగ్గజం ఆపిల్ సెల్‌ఫోన్ల రంగంలోకి కూడా ప్రవేశించి తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. ఇటీవలి కాలంలో ఆపిల్ సంస్థ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటూ ఇతర రంగాలలో కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ కారును రూపొందించే పనిలో నిమగ్నమై వుంది. ఇప్పుడు ఈ సంస్థ ఇళ్ళకు, కార్యాలయాలకు వేసే తాళాల తయారీ రంగంలో కూడా కృషిని ప్రారంభించింది. తాళం చేతుల అవసరం లేకుండా కేవలం ఫోన్ల ద్వారా వేయగలిగిన తాళాలను రూపొందించే పనిలో ఆపిల్ సంస్థ వుంది.
ద్విచక్ర వాహనాలు తయారుచేసే హీరో ఎలక్ట్రిక్ సంస్థ విద్యుత్ తో నడిచే ఇ-రిక్షా 'రాహీ'ని గురువారం ఆవిష్కరించింది. దీని ఖరీదు రూ 1. 10 లక్షలు. ఈ వాహనానికి 1000 వాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్ ఉందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీలు ప్రయాణించవచ్చని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ తెలిపారు.
సోషల్ నెట్ వర్కింగ్ లో ఫేస్బుక్ చాలా ప్రాచుర్యం పొందిందని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ 'రిఫ్' అనే మరో కొత్త యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐవోఎస్ ఫోన్లకు సపోర్ట్ చేసేలా దీనిని ప్రారంభించింది. 20 సెకన్ల నిడివిలో ఒక వీడియోను రికార్డు చేసి అవతలి వ్యక్తికి పంపించవచ్చు.
యాపిల్ ఐ ఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6 గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోమవారం భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ కంపెనీ ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లను ముందు బార్సినాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ ఆవిష్కరించింది.
త్వరలో గూగుల్ నుండి డ్రైవర్ అవసరం లేని కార్లు కూడా రాబోతున్నాయి. టెక్నాలజీలో ఎప్పుడూ వినూత్న ప్రయోగాలు చేసే గూగుల్ సంస్థ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేయబోతోంది. డ్రైవర్ అవసరం లేని ఈ కార్లను 2020 నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం అధిపతి క్రిస్ ఉర్మ్ సన్ తెలిపారు.
డాటావిండ్ సంస్థ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంస్థ 2జి 4స్మార్ట్ ఫోన్, 3జి 4స్మార్ట్ ఫాన్ అను రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ తులి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు.





