వెంటిలేటర్ పై సీతారాం ఏచూరి
Publish Date:Sep 6, 2024
Advertisement
సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏ చూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సీతారాం ఏచూరి గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత నెల 19వ తేదీ నుంచీ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం (సెప్టెంబర్ 6) తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sitaram-yechuri-health-condition-critical-39-184355.html
http://www.teluguone.com/news/content/sitaram-yechuri-health-condition-critical-39-184355.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





