Publish Date:Nov 15, 2024
విశాఖపట్నానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌గా నియమితులైన విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్ గతంలో వైసీపీలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న సీతంరాజు సుధాకర్ 2013 వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు. 2013లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన తరువాత సీతంరాజు విశాఖలో పార్టీ పటిష్టత కోసం పని చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీతంరాజు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆ తరువాత 2021లో ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. తరువాత 2023 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
సుధాకర్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాగా.. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు తెలపడంతో సీతంరాజు సుధాకర్ కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గడం మొదలైంది. దాంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గత ఏడాది డిసెంబర్ లో పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sitamraju-sudhakar-appointed-as-ntr-vaidya-seva-trusy-executive-39-188393.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.