ఫోన్ పే రచ్చ.. ఉచ్చు బిగుస్తోంది.. అయితే అరెస్టు అంత వీజీ కాదు!

Publish Date:Jun 23, 2025

Advertisement

ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన  ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ఏ కంచికి చేరుతుందో..  ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఏమో కానీ.. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం   ముందు ముందు పెద్ద తలకాయలకు చిక్కులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా  ఈకేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే  పని చేశానని ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం గా మారింది.  ప్రభాకర రావు స్టేట్మెంట్ ఆధారంగా  ‘సిట్’ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్  ను రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే వ్యూహాత్మకంగా.. ఎప్పటికప్పడు స్టాండ్’ మారుస్తూ వస్తున్న ప్రభాకర రావు..సిట్  విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకొచ్చారని, మాజీ ఐపీస్ అధికారి, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్  సహా పలువురు మాజీ అధికారులు, పరిపాలన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నిజానికి.. ఇంటెల్జెన్సీ మరీ ముఖ్యంగా పొలిటికల్ ఇంటెల్జెన్సీకి సంబందించిన వ్యవహారాల్లో డీజీపీ, హోం శాఖ కార్యదర్శి, చివరకు హోం మంత్రి ప్రమేయం కూడా ఉండదని.. ఎస్‌ఐబీ చీఫ్ నేరుగా శాంతి భద్రతల శాఖ మంత్రి, అంటే ముఖ్యమంత్రికి (హోం మంత్రి ఎవరైనా శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంచుకోవడం అన్నది అనాదిగా అన్ని రాష్ట్రాల్లో  ఆచారంగా వస్తోంది. గత ప్రభుత్వ హయంలోనూ అదే ఆచారం కొనసాగింది. నాయని నరసింహ రెడ్డి, మహ్మూద్ అలీ ఎవరు హోం మంత్రిగా ఉన్నా, శాంతి భద్రలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉన్నాయి.)  మాత్రమే రిపోర్ట్ చేస్తారని, ముఖ్యమంత్రి నుంచే, మౌఖిక, లిఖిత పూర్వక ఆదేశాలు స్వీకరిస్తారని  అంటున్నారు.

సో.. ఇక్కడ ప్రభాకర రావు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సీన్ లోకి తీసుకు రావడం ఒక విధంగా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నంగానే చూడాలని మాజీ అధకారులు అంటున్నారు. అయితే.. మరోవంక ప్రభాకర రావు ఇచ్చినట్లు చెపుతున్న స్టేట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్  మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.

అదలాఉంటే, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునను ఇప్పటికే ఐదుసార్లు విచారించిన  సిట్  మరో సారి అంటే ఆరో సారి ఆదివాకం   (జూన్ 23)  విచారించింది. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో.. బంతిని మాజీ డీజీపీ కోర్టులోకి నెట్టిన ప్రభాకర రావు, ఈ సారి ఎలాంటి  ప్రకటన చేస్తారు.. ఇంకెవరిని సీన్ లోకి తెస్తారు  అన్న ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతున్నాయి. నిజానికి..  ప్రభాకర రావు విచారణకు పెద్దగా సహకరించడం లేదనీ..  ఎన్నిగంటలు కూర్చోపెట్టినా, ఒకటీ అరా ప్రశ్నలకు   అరకొర సమాధానాలు ఇవ్వడమే కానీ, సరైన సమాధానలు ఇవ్వడం లేదని  సిట్   వర్గాల సమాచారం. ముఖ్యంగా..  ఆగష్టు 5 వరకు ప్రభాకర రావును అరెస్ట్ చేయరాదని సుప్రీం కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించిన నేపధ్యంలో..  ఆయన విచారణకు సహకరించక పోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సిట్ వర్గాలు అంటున్నాయి.

అదలా ఉంటే..  గత అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరి తో ఒకరు తలపడిన కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్ సహా, మరి కొందరు కాంగ్రెస్ నాయకులకు  సిట్ వారం రోజుల్లోగా సిట్ కార్యాలయాని వచ్చి వాగ్మూలం ఇవాలని నోటీసులు ఇచ్చింది. అలాగే.. మరి కొంతమంది రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ కూడా  సిట్  అధికారులు, రికార్డు చేయనున్నట్లు  తెలుస్తోంది. అదలా ఉంటే..  ఈ కేసు ఏనాటికైనా లాజికల్ కంక్లూజన్  కు చేరుతుందా ? పెద్ద తలల అరెస్ట్ వరకు వెళుతుందా అంటే..  అది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినంత ఈజీ అయితే కాదని అంటున్నారు.

By
en-us Political News

  
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.