ధర్మస్థలి మిస్టరీ మరణాలు.. సిట్ గోప్యత ఎందుకు?

Publish Date:Aug 5, 2025

Advertisement

ధర్మస్థలి మరణాల కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. ఈ విషయంలో పాటిస్తున్న గోప్యత.. తవ్వకాలలో బయటపడుతున్న విషయాలను వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు థర్మస్థలితో ప్రతి మరణం ఒక మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ మరణాలలో   పద్మలత కేసు మరో మిస్టరీగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి చెందిన కాలేజీలో  పద్మలత పీయూసి రెండవ సంవ త్సరం చదువుతున్నది.1986 డిసెంబర్ 22వ తేదీ మాయం అయింది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమె అదృశ్యం అయిన 56 రోజులు తర్వాత ఆమె శరీరం నేత్రావతీనదీ తీరంలో ఆస్థి పంజరంలా దొరికింది. ఆమె దుస్తులను బట్టి  ఆ అస్తిపంజరం పద్మలతదే అని గుర్తించారు. అప్పట్లో ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు.ఆమె ఆచూకీ లభించినా, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా  ఎవరూ పట్టించుకోలేదు.  పద్మలత తండ్రి దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన కమ్యూనిస్టు పార్టీతో  కలిసి చేసిన  ఆందోళనతో చివరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవానంద్ సమీప స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

పోలీసులు ఆమె మృతదేహం లభ్యమైన తరువాత కూడా  సరైన దర్యాప్తు చేయక,ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసారు. హిందువుల కుటుంబానికి చెందిన పద్మలత శరీరాన్ని సాధారణంగా దహనం చేస్తారు. కాని ఆమె తండ్రి   తన కుమార్తె మరణానికి కారకులకు ఎప్పటికైనా శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఖననం చేశారు.  ఆమె శరీరం అవశేషాలు భవిష్యత్తు లో నిజాలవెలికితీతకు ఉపయోగపడతాయన్న ముందు చూపుతో పద్మలత తండ్రి ఆ పని చేశారు. ఇప్పుడు థర్మస్థలి దురాగతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు పద్మలత మరణానికి కారకులైన వారిని పట్టుకుని చట్టం ముందు నిలిపి శిక్షించాలంటూ అలుపెరుగని పోరాటం చేసిన దేవానంద్ ఇప్పుడు బతికి లేరు. అయితే పద్మలత తల్లి,అక్క,బావా ఉన్నారు. దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు కావడంతో ప్రత్యర్థి రాజకీయవర్గాలు ఆమెను కిడ్నాప్ చేసారని తల్లి ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా పద్మావతి కిడ్నాప్ పై సరైన సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అత్యాచారంచేసి 56 రోజులు హింసించి ఆమె శరీరాన్ని సమీపంలోని అడవిలో పడేశారని ఆరోపిస్తున్నారు. ధర్మస్థలి అసహజ మరణాల కారకులే పద్మలతనూ హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

ఇలా ఒక్క పద్మలత అనే కాదు.. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. పద్మలత లాగే అనన్య భట్, సౌజన్య దారుణ హత్యకు గురయ్యారు. వీరి మరణాల విషయంలో కూడా కనీస సమాచారం లభించలేదు. అనన్య తల్లి సుజాత సీబీఐలో పనిచేస్తున్నా ఏమీ చేయలేకపోయారు.  22 ఏళ్లుగా అనన్య  అవశేషాలు దొరికితే సాంప్రదాయ పద్ధతిలో ముక్తి కలిగించాలని ఇమె ఎదురు చూస్తున్నారు.  అలాగే థర్మస్థలి మిస్టరీ మరణాల జాబితాలో సౌజన్య విషయం కూడా.  అనన్య, సౌజన్యల అసహజ మరణాల విషయంలో  సీబీఐ దర్యాప్తు లో  సంతోష్ అనే అనామకుడిని నిందితుడని తేల్చారు. కాని రెండేళ్ల కిందట  అతను నిర్దోషి గా తేలింది. అనన్య మృతదేహం లభ్యం కాలేదు. సౌజన్య మృతదేహం లభ్యమై, ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఇలాంటి పద్మలతలు, అనన్యలు,సౌజన్య లు ఎంతో మంది ధర్మస్థలి కర్కొకటకుల కాటుకు బలయ్యారు.  ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి రంగంలోకి దిగిన  సిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న   తవ్వకాల్లో పుర్రెలు,ఎముకలు దొరికాయన్న వార్తలు వస్తున్నా పోలీసు అధికారులు వాటిని ధృవీకరించడం లేదు.  

వందల శవాల పాతిపెట్టానని చెప్పిన పారిశుద్ధ కార్మికుడిని సిట్ బృందంలోని పోలీసు అధికారి బెదిరించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కూడా ఎవరూ ధృవీకరించడం లేదు. అంతే కాకుండాసిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న తవ్వకాలలో బయటపడుతున్న మానవ శరీరాల అవశేషాలకు సంబంధించి ఎటువంటి వార్తా బయటకు పొక్కడం లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో దర్యాప్తు తీరుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా సాగాలనీ, థర్మస్థలి తవ్వకాలలో బయటపడుతున్న వివరాలను వెల్లడించాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. 

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.